/rtv/media/media_files/2025/09/05/flipkart-big-billion-days-sale-2025-2025-09-05-13-15-59.jpg)
Flipkart Big Billion Days Sale 2025
Flipkart Big Billion Days Sale 2025: ఆహా ఓహో.. మరో అద్భుతమైన సేల్ వచ్చేస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ తన తదుపరి భారీ సేల్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 (Flipkart Big Billion Days Sale 2025) తేదీలను తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సేల్ ఈ నెల అంటే సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. ఇది అక్టోబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. కాగా ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus) సభ్యులకు ఒక రోజు ముందుగానే అందుబాటులోకి రానుంది. అంటే ఇది ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 22 నుంచి ఆఫర్లు పొందుతారు.
Flipkart Big Billion Days Sale 2025
ఇక్కడ మరొక విషయం ఏంటంటే.. అమెజాన్ కూడా తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అదే రోజున ప్రారంభిస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా ఈ రెండు ఈ కామర్స్ సంస్థల అమ్మకాల పోటీ మధ్య వినియోగదారులు అద్భుతమైన ప్రయోజనాలను పొందబోతున్నారు.
Flipkart Big Billion Days & Amazon Great Indian Festival Sale Date Announced 🎉 23rd Sept
— Techno Ruhez (@AmreliaRuhez) September 4, 2025
What Are you Buying This Sale? pic.twitter.com/qbtV7C1Mau
ఈ సేల్‌లో వినియోగదారులు ఐఫోన్ 16 సిరీస్, శామ్‌సంగ్ గెలాక్సీ S24 వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లను పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే దీనితో పాటు యాక్సిస్, ICICI బ్యాంక్ కార్డులపై 10% వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా నో-కాస్ట్ EMI కూడా అందిస్తుంది.
ఈసారి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను(flipkart offers 2025) సిద్ధం చేస్తోంది. యాప్‌లో టీజర్ ప్రకారం చూస్తే.. ఐఫోన్ 16 సిరీస్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 వంటి కొత్త ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను కలిగి ఉంది. అలాగే మోటరోలా ఎడ్జ్ 60 ప్రో కూడా భారీ తగ్గింపును పొందవచ్చు. అలాగే, Realme, Motorola, Google Pixel వంటి ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై కూడా అద్భుతమైన డిస్కౌంట్లు ఉంటాయి.
స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వంటి ఇతర వర్గాలపై కూడా ఈసారి భారీ డిస్కౌంట్‌లు పొందవచ్చు. Samsung Galaxy Book 4 ల్యాప్‌టాప్‌లు రూ. 40వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Intel Core Ultra ప్రాసెసర్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లపై ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి. ఇంకా టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్‌ల పైన నో-కాస్ట్ EMI, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
ఇది మాత్రమే కాకుండా OnePlus Buds 3 కూడా భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, TWS ఇయర్‌బడ్‌లతో పాటు వినియోగదారులు Intel PCలు, 55-అంగుళాల స్మార్ట్ టీవీలు, ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్‌లపై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులు పొందవచ్చు.
Also Read: షాకింగ్ వీడియో: ఊరేగింపులో పాములతో డ్యాన్సులు.. చివరికి..!
కాగా ఫ్లిప్‌కార్ట్ ఈసారి Axis బ్యాంక్, ICICI బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే Flipkart-SBI కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. పేటీఎం (Paytm) ద్వారా కొనుగోలు చేసే వారికి అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.