/rtv/media/media_files/2025/09/19/flipkart-big-billion-days-sale-2025-geyser-offers-2025-09-19-18-24-20.jpg)
Flipkart Big Billion Days Sale 2025 Geyser Offers
పండుగ సీజన్‌కు ముందు ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలు, రిటైల్ షాపులు పలు ప్రొడెక్టులపై ఆకట్టుకునే ఆఫర్‌లను అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ టీవీలు.. ఇలా చాలా ఉత్పత్తులను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అందువల్ల త్వరలో శీతాకాలం రాబోతుంది. చల్లటి నీటితో స్నానం చేయాలంటే వణికిపోవాల్సిందే. కాబట్టి ఇప్పటి నుంచే తక్కువ ధరకు లభించే గీజర్‌ను కొనుక్కుంటే చాలా మంచిది. లేకపోతే వీటి ధరలు క్రమ క్రమంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది.
Flipkart Big Billion Days Sale 2025 Geyser Offers
అందువల్ల శీతాకాలం రాకముందే తక్కువ ధరకు గీజర్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం. గీజర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ఇ-కామర్స్ దిగ్గజం Flipkart Big Billion Days Sale 2025 సమయంలో మీరు వీటిపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. వీటిలో అనేక గీజర్‌లపై 50% వరకు తగ్గింపులు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Havells Geyser
తక్కువ ధరకు నాణ్యమైన గీజర్ కొనాలని చూస్తున్నట్లయితే.. Havells Geyser ఉత్తమ ఆప్షన్. Flipkart Big Billion Days Sale 2025కు ముందే రెండు Havells Geyserలు ప్రస్తుతం భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. హావెల్స్ అడోనియా స్పిన్ 15L స్టోరేజ్ గీజర్ (Havells Adonia Spin 15 L Storage Geyser) ప్రస్తుతం 50% కంటే ఎక్కువ తగ్గింపుతో రూ.9,790కి అందుబాటులో ఉంది. అందువల్ల 15-లీటర్ సామర్థ్యం కలిగిన పెద్ద గీజర్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెటర్. దీనికి 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ కూడా ఉంది. కంపెనీ దాని లోపలి ట్యాంక్‌పై 7 సంవత్సరాల వారంటీని, దాని హీటింగ్ ఎలిమెంట్స్‌పై 4 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది.
దీంతో పాటు హావెల్స్ ఇన్‌స్టానియో 10L గీజర్ (Havells Instanio 10L Geyser) అసలు ధర రూ.14,290 ఉండగా.. ప్రస్తుతం రూ.6,390కి అందుబాటులో ఉంది.
Hindware Geyser
హిండ్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ యొక్క IMMEDIO 3L ఇన్‌స్టంట్ గీజర్(Hindware Smart Appliances IMMEDIO 3L Instant Geyser) ఈ సేల్ సమయంలో భారీ తగ్గింపుతో లభిస్తుంది. దీని అసలు ధర రూ.5,990 అయినప్పటికీ.. ఆఫర్‌లో దీనిని కేవలం రూ.1,899కే కొనుగోలు చేయవచ్చు. ఈ గీజర్ 3-లీటర్ సామర్థ్యం, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. కంపెనీ ఈ ప్రొడెక్టుపై 5 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది.
Orient Geyser
ఓరియంట్ ఎలక్ట్రిక్ SWCN10VPG8K2-WB గీజర్ (Orient Electric SWCN10VPG8K2-WB Geyser) కూడా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. 10-లీటర్ స్టోరేజ్ ట్యాంక్‌ను కలిగి ఉన్న ఈ గీజర్ అసలు ధర రూ.12,490గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఆఫర్‌లో దీనిని కేవలం రూ.5,999కి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ట్యాంక్‌పై 5 సంవత్సరాల వారంటీ, హీటింగ్ ఎలిమెంట్‌పై 2 సంవత్సరాల వారంటీ, మొత్తం ప్రొడెక్టుపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తోంది.