/rtv/media/media_files/2025/09/19/nano-banana-ai-2025-09-19-15-27-12.jpg)
Nano Banana Ai
ఇప్పుడు ఎక్కడ చూసినా నానో బనాన (Nano Banana) ట్రెండ్ నడుస్తోంది. ఈ Google Gemini 2.5 Flash Image టూల్‌ను కొన్ని కోట్ల మంది ప్రజలు ఉపయోగించి తమ ఫొటోలను 3డీ రూపంలో పొందుతున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది వినియోగదారులకు అత్యంత సులభంగా, వేగంగా, ఆకర్షణీయమైన డిజిటల్ క్రియేషన్స్‌ను తయారు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడంతో ఎంతో మంది ఈ టూల్‌కు ఫిదా అవుతున్నారు.
Nano Banana 3D photo trend
ఈ క్రమంలో మరో AI కంపెనీ అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ పెర్‌ప్లెక్సిటీ AI (Perplexity AI) కంపెనీ వినియోగదారుల కోసం కొత్త సదుపాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు Perplexity AI ద్వారా నానో బనానా ట్రెండ్‌ను వాట్సాప్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు 3D ఫోటోలను Google Gemini 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్ ద్వారా మాత్రమే పొందే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పెర్‌ప్లెక్సిటీ కంపెనీ దీనిని తమ వాట్సాప్ బాట్‌లో అనుసంధానించింది.
ఈ మేరకు కంపెనీ CEO, సహ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘ఇకపై Nano Banana పర్‌ప్లెక్సిటీ వాట్సప్ బాట్‌లోనూ అందుబాటులో ఉంటుంది’’ అంటూ పోస్ట్ పెట్టారు. అయితే Perplexity AI ద్వారా వాట్సాప్‌లో ఏ విధంగా ఫొటోలు క్రియేట్ చేసుకోవాలి..? దీనికి ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఉందా?.. అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అయితే దీనికోసం కంపెనీ ఒక మొబైల్ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది.
వాట్సాప్‌లో నానో బనాన తరహాలో 3డి ఫొటోలను ఇప్పుడు Perplexity AIలో పొందేందుకు కంపెనీ (+1 (833) 436-3285)ను అందించారు. దీని ద్వారా Gemini AI లో ఎలాగైతే ప్రాంప్ట్ ఇచ్చి ఫొటోలను నచ్చిన విధంగా క్రియేట్ చేసుకున్నామో.. ఇప్పుడు అదే విధంగా వాట్సాప్ బాట్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు.
Nano banana just dropped on Perplexity 🍌
— Ask Perplexity (@AskPerplexity) September 18, 2025
Generate or edit any image using the highest-quality model directly on WhatsApp
Message +1 (833) 436-3285 to start pic.twitter.com/MrOY0wePHS
ఎలా పని చేస్తుంది?
పెర్‌ప్లెక్సిటీ AI వాట్సాప్ నంబర్‌ను మీ కాంటాక్టులో సేవ్ చేసుకోవాలి.
ఆ తర్వాత వాట్సాప్‌లో ఆ కాంటాక్ట్‌కు మెసేజ్ పంపించాలి.
అనంతరం మీరు మార్చాలనుకుంటున్న ఫోటోను సెలెక్ట్ చేసి.. దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి.
దీని తర్వాత పెర్‌ప్లెక్సిటీ AI మీ సూచనల ఆధారంగా ఆ ఫోటోను నానో బనానా స్టైల్ 3D ఫొటోగా మార్చి తిరిగి పంపుతుంది.
అయితే నానో బనాన ఏఐ స్థాయిలో పర్‌ప్లెక్సిటీ ఫొటోలు రాకపోతే.. పర్‌ప్లెక్సిటీ ప్రోను యూజర్లు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దీనికోసం పర్‌ప్లెక్సిటీ ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌తో జోడి కట్టింది. ఇందుకోసం 12 నెలల పాటు ప్రో సబ్‌స్క్రిప్స్‌ను ఫ్రీగా అందిస్తోంది. దీంతో కస్టమర్లు జెమిని, క్లౌడ్, జీపీటీ వంటి అనేక అడ్వాన్స్ ఏఐ మోడళ్లకు యాక్సెస్ పొందొచ్చు.