/rtv/media/media_files/2025/04/14/iwcaYXYc5PnFU8aaJq5P.jpg)
ప్రస్తుతం వాట్సాప్ వాడకుండా ఎవరూ ఉండటం లేదు. కేవలం వ్యక్తిగత మెసేజ్‌ల కోసమే కాకుండా ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఈ యాప్ సేవలు అందరూ వినియోగించుకుంటున్నారు. భారత్‌లో కోట్లాదిమంది వాట్సాప్ వాడుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ వల్ల మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. వాట్సాప్‌లో బగ్ గుర్తించామని.. కేంద్ర ఐటీశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ హెచ్చరికలు చేసింది.
Also Read: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?
Also Read : మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. వారి వద్ద ఏం దొరికాయో తెలుసా?
Indian Government Warnings For WhatsApp Users
వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను వినియోగిస్తున్న యూజర్లు కూడా ప్రమాదంలో ఉన్నారని CERT-In తెలిపింది. డెస్క్‌టాప్ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వాడుతున్న యూజర్లు.. డెస్క్‌టాప్ వెర్షన్ 2.2450.6 కంటే పాత వెర్షన్ వాడుతున్నట్లయితే ఆయా యూజర్ల సిస్టమ్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. బగ్ వల్ల హ్యాకర్లు మీ డివైజ్‌ను వాట్సాప్ సాయంతో యాక్సెస్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. వాట్సాప్ డెస్క్‌టాప్ అప్లికేషన్ సెక్యూరిటీ పరంగా బలహీనంగా ఉందని తెలిపింది. ఇది ఫైల్ ఓపెనింగ్ ప్రాసెస్‌కు సంబంధించిందని పేర్కొంది. ఎంఐఎంఈ రకం, ఫైల్ ఎక్స్‌టెన్షన్ మధ్య సరిపోలకపోవడం వల్ల వాట్సాప్ పలు అటాచ్‌మెంట్స్‌ను సరిగా గుర్తించలేకపోతుందని చెప్పింది. ఈ టెక్నికల్ బలహీనతను వినియోగించుకుని హ్యాకర్స్ మీ కంప్యూటర్లో వైరస్ చొప్పించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Also Read: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు .. స్పందించిన ప్రధాని మోదీ
అంతేకాదు హ్యాకర్స్ సిస్టమ్స్‌కి పంపించే ప్రమాదకరమైన ఫైల్స్ సాధారణంగానే ఉంటాయని.. ఈ ఫైల్స్‌ని ఓపెన్ చేస్తే వ్యక్తిగత డేటా తస్కరణకు గురయ్యే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది. వాట్సాప్ డెస్క్‌టాప్‌ను వాడేవాళ్లందరూ అప్లికేషన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఏవైన గుర్తు తెలియని లింక్స్‌ని క్లిక్ చేయడం మానుకోవాలని.. తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌కు రిప్లే ఇవ్వొద్దని.. ప్రతి అప్‌డేట్‌తో వెంటనే వాట్సాప్ అప్లికేషన్ కొత్ వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలని సెర్ట్ సూచనలు చేసింది.
Also Read : అడవిపై బుల్డోజర్లు.. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై స్పందించిన మోదీ!
hackers | rtv-news | telugu-news | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest technology news telugu