PM Modi: అడవిపై బుల్డోజర్లు.. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై స్పందించిన మోదీ!

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో.. తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీసంపదను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

New Update
PM Modi Responds on HCU Lands

PM Modi Responds on HCU Lands

ఇటీవల సంచలనం రేపిన కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో.. తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉంది. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీసంపదను నాశనం చేస్తున్నారు. దీనివల్ల ప్రకృతి నష్టం,జంతువులకు ప్రమాదం జరుగుతోంది. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని'' ప్రధాని మోదీ విమర్శించారు. 

Also Read: వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు .. స్పందించిన ప్రధాని మోదీ

అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ''హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజలు ఆందోళనల వల్ల అభివృద్ధి కుంటుబడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు అన్ని ధరలు పెరుగుతున్నాయి. కర్ణాటకను కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో నెంబర్‌ వన్‌ చేసింది. సత్యం ఆధారంగా, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తోంది. వికసిత్ భారత్‌ కోసం బీజేపీ పనిచేస్తోందని'' మోదీ అన్నారు.  

PM Modi Responds On Kancha gachibowli Lands

Also Read: సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని మళ్ళీ బెదిరింపు..ఇంట్లోకి దూరి మరీ..

ఇదిలాఉండగా ఇటీవల హెచ్‌సీయూలో కంచ గచ్చిబౌలి భూములపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. 400 ఎకరాలను రేవంత్ సర్కార్ అమ్మకానికి పెట్టడంతో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా వీళ్లకు మద్దతు ఇవ్వడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. సుప్రీంకోర్టుకు కూడా ఈ వివాదం చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ HCUలో వివాదాస్పద భూములపై పరిశీలను వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ భూములపై ప్రధాని మోదీ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also Read: 'జాగ్రత్త.. మీ వాట్సాప్‌ హ్యాక్ అవ్వొచ్చు'.. కేంద్రం హెచ్చరిక

Also Read :  గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్‌.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

 

telugu-news | rtv-news | hcu lands | latest telangana news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు