అఘోరీ ఎపిసోడ్ ట్విస్టుల మీద ట్విస్టులతో సినిమాను తలపిస్తుంది. ఇప్పటి వరకు సనాతన ధర్మం, అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపడానికి వచ్చానని చెప్పింది. ఈ ఎపిసోడ్ దాదాపు మూడు నాలుగు నెలలు గడిచింది. ఆ తర్వాత గత నెల రోజుల నుంచి శ్రీవర్షిణితో వ్యవహారం బయటకొచ్చింది.
Also Read : కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
ఆమెకు సాధన నేర్పిస్తానని.. మహిళల కోసం అండగా ఉండేందుకు ధైర్యాన్ని అందిస్తాను అని చెప్పి వర్షిణీని పెళ్లి చేసుకుంది. ఇప్పుడిదే హాట్ టాపిక్ అనుకుంటే మధ్యలో.. నేనే అఘోరీ మొదటి భార్యను అంటూ ఓ మహిళ మీడియా ముందుకొచ్చింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
అఘోరీ నన్నే ముందు పెళ్లి చేసుకుంది. నా మెడలో తాళి కట్టింది. మొన్న మార్చి నెల వరకు నాతో బాగానే ఉంది. కానీ ఇప్పుడు వర్షిణీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నాకు నువ్వు వద్దు అనే సరికి మీడియా ముందుకు వచ్చాను అని తెలిపింది. దీంతో అఘోరీ ఎపిసోడ్స్ చూసి ప్రజలు ఖంగుతింటున్నారు.
రాధీ బాగా గుర్తొస్తున్నావే
ఈ క్రమంలో అఘోరీ తన మొదటి భార్యతో మాట్లాడిన రొమాంటికి ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఆడియో ప్రకారం.. ‘‘రాధీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. చాలా గుర్తుకొస్తున్నావ్. కానీ ఏం చేస్తాం. నేను వచ్చిన తర్వాత నీకు తాళి కడతాను రాధీ. లవ్ యు లవ్ యు. మిస్ యు లవ్ యు.
Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!
నాతోని అవ్వట్లేదు. హార్ట్‌లో చాలా పెయిన్‌గా ఉంది. మనిద్దరం ఇలాగే జీవితాంతం కలిసి మెలిసి ఒకే ఇంట్లో ఉండాలనేది నా కోరిక. ఆ కోరికను నువ్ ఎంత దూరం తీసుకెళ్తావో నీ డెషిషన్. నువ్వు ఎప్పుడూ నాకు స్పెషల్. నీకు తాళి కట్టిన తర్వాత నీ లెవెల్ వేరే. ’’ అంటూ ఆ ఆడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది.
(aghori | aghori srivarshini | aghori sri varshini | latest-telugu-news | Aghori First Wife)