AP Elections 2024 : ఎన్నికలకు సిద్ధం అవుతున్న టీడీపీ.. తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు వీరే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరికి సంబంధించి టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు వీరే అంటూ ఒక లిస్ట్ బయటకు వచ్చింది.  జనసేనతో పొత్తులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఆపార్టీ అభ్యర్ధులను ఇన్ ఛార్జ్ లుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
AP Elections 2024 : ఎన్నికలకు సిద్ధం అవుతున్న టీడీపీ.. తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు వీరే?

East Godavari District : టీడీపీ ఎన్నికల కసరత్తు వేగవంతం అయింది. అభ్యర్దుల ఖరారు పైన పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఫోకస్ చేసారు.ఎన్నికల్లో ఎవరికి అధికారం దక్కాలన్నా గోదావరి జిల్లాలు కీలకం. అందులోనూ తూర్పు గోదావరిలో ఉన్న 19 నియోజకవర్గాలు చాలాముఖ్యమైనవి. అందుకే ముందుగా ఈ జిల్లా ఇన్చార్జ్ లను నియమించడానికి ప్లాన్ చేస్తోంది టీడీపీ.

1.తుని....
టిడిపి(TDP) ఇన్చార్జ్ యనమల కుమార్తె యనమల దివ్యను ఇక్కడ నుంచి పోటీకి దించాలని డిసైడ్ అయింది. యనమల కృష్ణుడు వరుసగా రెండు సార్లు ఓటమి తో మార్పు చేసినట్టుగా తెలుస్తోంది.

2.ప్రత్తిపాడు
ఇక్కడ ఇన్చార్జ్ గా వరుపుల రాజా సతీమణి వరుపుల సత్యప్రభను పోటీకి దించుతోంది. ఈమె భర్త వరుపుల రాజా గుండె పోటుతో మృతి చెందడంతో ఈ సీటును సత్యప్రభకు ఇచ్చారు.

3.జగ్గంపేట...
మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు జోతుల నెహ్రూ ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు.

4.పిఠాపురం..
ఇక్కడ గెలిచే అవకాశాలు 50/50 ఉండడంతో టిడిపి ఇన్చార్జ్ గా SVSNవర్మను బరిలోకి దించుతున్నారు. ఇక్కడ వర్మ రెబల్ గా బలంగా ఉన్నారు. అయితే పొత్తుల్లో భాగంగా ఇక్కడి సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే...జనసేనాని పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీకి దిగితే గెలిచే అవకాశం ఉంది. లేకపోతే ఇకక్కడి జనసేన అభ్యర్ధి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు మాత్రం అస్సులు అవకాశం లేదు. అలాంటప్పుడు టీడీపీ నుంచి రెబల్ క్యాండిడేట్ వర్మనే బరిలోకి దించుతారని తెలుస్తోంది.

5. పెద్దాపురం....
టిడిపి సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప పోటీకి దిగుతారు.

6.కాకినాడ
టిడిపి ఇన్చార్జ్ గా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును నియమించారు. ఇతను మత్స్యకార నాయకుడు కావడం వలన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధినాయకత్వం భావిస్తోంది.

7.కాకినాడ రూరల్.....
ఇక్కట సీట్ ను పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో కాకినాడ రూరల్ నుంచి జనసేన ఇన్చార్జ్ పంతం నానాజీ పోటీ చేస్తారు. అయితే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే... పిల్లి సత్తిబాబు అనంతలక్ష్మి దంపతులు,కంటకంశేట్టి ప్రభాకర్లు ఆశావహులుగా ఉన్నారు. దీని మీద ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.

8.అమలాపురం..
టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పోటీ చేయనున్నారు. జనసేన నుండి జశెట్టి బత్తుల రాజబాబు,DMRశేఖర్ లు కూడా పోటీలో ఉన్నారు.

9.పి.గన్నవరం..
టిడిపి-జనసేన రెండు పార్టీలకూ ఇక్కడ ప్రస్తుతం ఇన్చార్జ్ ఎవరు లేరు. కానీ ఈ సీట్ ను జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

10.ముమ్మిడివరం...
టిడిపి మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పోటీ చేయనున్నారు.మరోవైపు జనసేన నేత పితాని బాలకృష్ణ కూడా ఈ సీట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు.

11.రామచంద్రపురం....
టిడిపి ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం పోటీకి దిగుతారని సమాచారం. మరోవైపు రామచంద్రపురంలో పిల్లి బోస్ కుమారుడు సూర్యప్రకాష్ కి వైసిపి టిక్కెట్ ఇవ్వకపోతే..జనసేన నుండి పోటీచేసే అవకాశం ఉంది.

12.కొత్తపేట...
టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పోటీ

13.మండపేట....
టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పోటీ చేస్తారు.

14.రాజోలు...
జనసేన నేత బోంతు రాజేశ్వరరావు పోటీ. అలాగే టిడిపి ఇన్చార్జ్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కూడా పోటీలో ఉన్నారు.

15.రాజమండ్రి...
టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసు పోటీ చేసే అవకాశం ఉంది.

16.రాజమండ్రి రూరల్...
టీడీపీ,జనసేన పొత్తులో భాగంగా కందుల దుర్గేష్ పోటీ చేస్తారని తెలుస్తోంది. కానీ ఇక్కడ టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎక్కువగా గెలిచే అవకాశాలున్నాయి. అందుకే దీని మీద నిర్ణయం మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

17.రాజానగరం...
జనసేన నుంచి బత్తుల బలరాం కృష్ణ భార్య బత్తుల వెంకటలక్ష్మీ పోటీ చేస్తారు. టిడిపి బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా టికెట్ ను ఆశిస్తున్నారు.

18.అనపర్తి
టిడిపి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.

19.రంపచోడవరం
టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు