స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి జైలుకెళ్లిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున చంద్రబాబు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన వెంట భార్య నారా భువనేశ్వరి ఉన్నారు. చంద్రబాబు దంపతులకు రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చంద్రబాబు కృష్ణా జిల్లా గన్నవరానికి రానున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు గన్నవరం వద్ద చంద్రబాబును స్వాగతించేందుకు భారీగా ఏర్పా్ట్లు చేశారు. ఎయిర్పోర్టు నుంచి ఉండవల్లి వరకు చంద్రబాబు వెంట కార్లు, బైకులతో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ చేయనున్నారు. మధ్యాహ్నం 2.00 గంటలకి ఆయన ఉండవల్లికి చేరుకునే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Chandrababu Naidu: రాజకీయ కార్యక్రమాలకు సిద్ధమవుతున్న చంద్రబాబు.. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే..
ఇటీవల బెయిల్ నుంచి విడుదలైన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం ఆయన కృష్ణా జిల్లా గన్నవరానికి రానున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు గన్నవరం వద్ద చంద్రబాబును స్వాగతించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.
Translate this News: