Crime News : అమలాపురంలో దారుణం... వ్యక్తిని చితక్కొడుతూ వీడియోలు చిత్రీకరణ..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. దోనిపాటి మహేష్ అనే వ్యక్తి పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయినవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దోనిపాటి మహేష్ పై దాడి చేసిన ముగ్గురు దాడిసమయంలో వీడియోలు చిత్రీకరించారు.