Kakinada: బోడి గుండుపై జుట్టు పెంచుతామంటూ.. కాకినాడలో కలకలం రేపుతున్న మరో కొత్త మోసం!
కాకినాడలో VRS హెయిర్ క్రియేషన్స్ క్లీనిక్ సురేష్ అనే వ్యక్తికి జుట్టు వచ్చేలా ట్రీట్మెంట్ చేస్తామని మోసం చేశారు. లక్షకు పైగా డబ్బులు వసూలు చేశారు. అయినా జుట్టు రాకపోవడంతో సురేష్ పోలీసులను సంప్రదించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.