Yadadri Bhuvanagiri : ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్స్ లో ఘోరప్రమాదం..ముగ్గురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది.