/rtv/media/media_files/2025/07/23/love-couple-2025-07-23-10-50-15.jpg)
ove couple
వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆమె, కాదు జీవితంలో స్ధిరపడాలని అతను ఇద్దరిమధ్య ఎడతెగని వాదన పెళ్లి చేసుకుంటావా? చావామంటావా వరకు వెళ్లింది. చివరికి పోలీసుల కౌన్సెలింగ్‌తో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే...
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
Will You Marry Me Right Now - Psycho Lover
సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థిని ఒకరు.. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలానికి చెందిన విద్యార్థి అదే కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ ఇద్దరూ హైదరాబాద్ లోని వేర్వేరు హాస్టల్స్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ భువనగిరి బస్టాండ్‌లో కలుసుకున్నారు.
Also Read: దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు
సరదాగా గడిపిన అనంతరం తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇద్దరూ మధ్యాహ్నం భువనగిరి బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి మొండికేసింది. ‘నిన్ను వదిలి నేను వెళ్లను. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం’ అని విద్యార్థిని పట్టుపట్టింది. దానికి ఆ విద్యార్థి ఒప్పుకోలేదు. ‘ఇప్పుడే వద్దు. జీవితంలో స్థిరపడ్డాకే చేసుకుందాం’అని బతిమిలాడుకున్నాడు. కానీ, ఆ అమ్మాయి వినలేదు. "ఇప్పుడే వివాహం చేసుకుందాం.. లేదంటే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంటా’’నంటూ ఓ విద్యార్థిని బెదిరింపులకు దిగింది, అయినా ఆ అబ్బాయి ససేమిరా అన్నాడు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఇదే గొడవ. అమ్మాయిని వదిలి వెళితే ఆమె ఎక్కడ అఘాయిత్యానికి పాల్పడతుందోననే భయంతో అక్కడే ఉండి వారిస్తూనే ఉన్నాడు. అయినా సయోధ్య కుదరకపోగా ఆమె బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టింది. కాగా గంటల తరబడి వారి మధ్య జరుగుతుందన్న సంవివాదాన్ని గమనించిన బస్టాండ్ పారిశుధ్య కార్మికులు, ఆర్టీసి సిబ్బంది, బస్టాండ్ చెక్ పోస్ట్ కానిస్టేబుల్‌తో పాటు మరికొందరు వారిని మందలించి అక్కణ్నుంచి వెళ్లిపోవాలని సూచించినా వారు అక్కడి నుంచి కదలలేదు. ఒక దశలో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడానికి పోన్ నెంబర్లు అడిగినా వారు ఇవ్వలేదు. చేసేది లేక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఇద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో కూల్ అయిన జంట ఇంటిదారి పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
police-station | love-couple | bhuvanagiri news | Yadadri Bhuvanagiri District | bhuvanagiri lovers incident | bhuvanagiri lovers news | bhuvanagiri