/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)
Rain
RAINS : రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మెదక్ జిల్లాను వర్షాలు ముంచేత్తాయి. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది చిక్కుకున్నారు. వరదల్లో ఇద్దరు గల్లంతయ్యారు. మిగిలిన 10మందిలో ఒకరిని స్థానికులు కాపాడారు. మిగిలిన 9 మందిని రక్షించేందుకు DRF టీమ్ ప్రయత్నం చేస్తుంది. మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్‌లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హవేలి ఘన్‌పూర్‌లో ఒక కారు వాగులో కొట్టుకుపోయింది. ఆ -- కారులో నలుగురు ప్రయాణికులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Also Read: ఉద్యోగం కోసం ఇక అమెరికా పోలేరు.. భారతీయులకు ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్
మెదక్ జిల్లాలోని ధూప్‌సింగ్ తండా వరదలో మునిగిపోయింది. తమను కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు చేస్తున్నారు.-- గ్రామస్తులను కాపాడేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని ధూప్‌సింగ్ తండా యువకులు కాపాడారు. రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది.-- 300 మంది విద్యార్ధులను అధికారులు సురక్షితంగా రక్షించారు.13 రోజులుగా వరద ఏడుపాయల ఆలయం గుప్పిట్లోనే చిక్కుకుంది. జిల్లాలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచున చిక్కుకుంది.ఏ క్షణమైనా పోచారం ప్రాజెక్టు కట్ట తెగిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వరదలతో మెదక్, కామారెడ్డి జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. మెదక్, కామారెడ్డి జిల్లా రహదారులు అష్టదిగ్బంధంలో చిక్కుకున్నాయి.రేపు మెదక్ జిల్లాలోని అన్ని స్కూళ్లకు కలెక్టర్ రాహుల్ రాజ్ సెలవు ప్రకటించారు. గవర్నమెంట్‌తో పాటు ప్రైవేటు పాఠశాలలు బంద్ చేయనున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. కామారెడ్డి - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 44 వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. యాదాద్రి జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది. భువనగిరి- నల్లగొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోదాదాపుగా 3 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంగెం వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది
కామారెడ్డికి మరోసారి భారీ వర్ష సూచన చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి మూసివేశారు.ఇప్పటికే కామారెడ్డి లోతట్టు కాలనీలు నీట మునిగాయి.కార్లు, ఆటోలు వరదల్లో కొట్టుకుపోయాయి.తమను రక్షించాలంటూ జనం ఆర్తనాదాలు చేస్తున్నారు.రాజంపేట మండలం ఆరుగొండలో 41 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. కామారెడ్డి టౌన్‌లో 21 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. రేపు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా ఈ వరదల్లో ఒక కారు చిక్కుకోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు. కాగా వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైన సహయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: హిందూమహాసముద్రంలో కూలిపోయిన స్పేస్ X రాకెట్.. ఇండియాకి ప్రమాదమా?