/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t123528772-2025-11-02-12-38-59.jpg)
Serious road accident in Bibi Nagar
BB Nagar: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి జిల్లా బీబీ నగర్ చెరువుకట్టపై థార్ బీభత్సం సృష్టించింది. ఇద్దరి ప్రాణాలను బలిగొంది.హైవేపై వెళుతున్న థార్ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అతివేగంతో అదుపుతప్పిన వాహనం పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన సంభవించింది. అక్కడ నిలుచుని ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. పక్కనే ఉన్న చెరువులో పడి యువతి ప్రాణాలు కోల్పోయింది. వాహనంలోని ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించారు.
మృతులిద్దరూ భార్యాభర్తలుగా భావిస్తున్నారు. రోడ్డు పక్కన బైక్ ఆపి భార్యభర్తలు నిలబడి ఉండగా 150km స్పీడుతో వస్తున్న థార్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో అదుపుతప్పి భార్యాభర్తలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో భర్త తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక భార్య ఎగిరి చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది.
ఈ అనూహ్య ఘటనతో చెరువుకట్ట ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: నిశ్చితార్థానికి ముందు ఊహించని ట్విస్ట్! వధువు తండ్రితో వరుడి తల్లి జంప్
Follow Us