/rtv/media/media_files/2025/07/05/yadagirigutta-2025-07-05-13-06-16.jpg)
Yadagirigutta
Yadagirigutta:
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట(Yadadri Bhuvanagiri District) పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీనరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా శనివారం ఉదయం భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ జరిగింది. వేలాది మంది భక్తులు కొండ చుట్టూ తిరుగుతూ జయజయధ్వానాలు చేశారు. తొలుత వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు(Pooja) నిర్వహించిన అనంతరం.. కొండ చుట్టూ తిరుగుతూ భక్త పారవశ్యంలో మునిగిపోయారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది.
Also Read: Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!
ప్రత్యేక ఆరాధనలో భాగంగా స్వాతి నక్షత్రం సందర్భంగా గర్భాలయంలోని మూలవరులకు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. వారంతం కావడంతో భక్తులతో యాదగిరి గుట్ట గిరులు భక్తులతో నిండుకున్నాయి. ఎటు చూసిన భక్తులతో సందడి నెలకొన్నది. తెలంగాణ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో దేవాలయ ప్రాంగణమంతా సందడి నెలకొన్నది. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా శనివారం శ్రీవేంకటేశ్వర అన్నమాచార్య సేవా ట్రస్ట్ బృందం ప్రదర్శించిన భరత నాట్యం ఆకట్టుకుంది.
Also Read: ఎవర్రా మీరంతా.. అప్పుడేమే 90 డిగ్రీల వంతెన.. ఇప్పుడు పాములా మెలికలు తిరిగేలా