/rtv/media/media_files/2025/07/27/yadagirigutta-2025-07-27-12-49-14.jpg)
Yadagirigutta
శ్రావణమాసం ప్రారంభమైంది. దీంతో దేవాలయాలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రావణ మాసం తొలి ఆదివారం సందర్భాన్ని పురష్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
Also Read : పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!
Also Read : చికెన్ ధరలు ఢమాల్.. కేజీ మరీ ఇంత చీప్ గానా!
Devotees Flock To Yadagirigutta
పెద్ద ఎత్తున భక్తుల రాకతో దేవాలయ ప్రాంగణం కిక్కిరిసింది. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రసాద విక్రయ శాల, కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరణి, కారు పార్కింగ్, బస్టాండ్‌లో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి ధర్మ దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. పెద్ద ఎత్తున భక్తుల రాకతో వాహనాలు రద్దీ నెలకొంది.
Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!
Also Read : గండికోట మైనర్ హత్య కేసులో సంచలనం.. మర్డర్ వెనుక ఆ రాజకీయ నేత?
yadagiri-gutta | yadadri | yadadri-bhuvanagiri | Yadadri Bhuvanagiri District