CRIME : చావు పిలుస్తోందంటూ చెరువులో దూకిన భర్త...భర్తతో పాటే తానంటూ భార్య..

పది రోజుల నుంచి చావు నన్ను పిలుస్తోంది.. నేను ఎలాగైనా అక్కడికి వెళ్లాలి.. అంటూ భార్యకు, బంధువులకు మెసేజ్‌ చేసి యాదాద్రి జిల్లా బీబీనగర్​ చెరువు వద్దకు వెళ్లి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య సంధ్య అదే చెరువులో దూకింది.

New Update
Bank manager commits suicide

Bank manager commits suicide

CRIME :  పది రోజుల నుంచి చావు నన్ను పిలుస్తోంది.. నేను ఎలాగైనా అక్కడికి వెళ్లాలి..  అంటూ భార్యకు, బంధువులకు మెసేజ్‌ చేసి యాదాద్రి జిల్లా బీబీనగర్​ చెరువు వద్దకు వెళ్లి చెరువులో దూకి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాకు పది రోజులుగా మానసిక స్థితి బాగా లేదు. చావు రమ్మని పిలుస్తోంది. అందుకే బీబీనగర్​చెరువులో దూకి చనిపోతున్నా. నా అంత్యక్రియలు పాత ఇంటి వద్ద చేయాలి”. అంటూ వాయిస్​ మెసేజ్​లో తెలిపిన బర్ల సురేందర్‌ అనే వ్యక్తి బీబీనగర్‌ చెరువులో దూకాడు. బీబీ నగర్‌ సీఐ ప్రభాకర్‌రెడ్డి కథనం ప్రకారం  హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన బర్ల సురేందర్‌(36) తన కుటుంబం తో కలిసి హైదరాబాద్‌ రామంతాపూర్‌లో నివాసముంటున్నాడు. హైటెక్‌సిటీలో ICICI బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సురేందర్
పదిరోజులుగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. చావు తనను పిలుస్తోందంటూ ఆందోళన చెందుతున్నాడు. దీంతో మూడీగా ఉంటున్నాడు.

Also Read: తెలంగాణకు 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

శుక్రవారం ఉదయం బ్యాంక్​కు వెళ్తున్నానని  ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. సురేందర్‌ నేరుగా బీబీనగర్‌ చేరుకున్నాడు. అక్కడ తన ఫోన్‌లో  ‘ నేను బీబీనగర్‌ చెరువు దగ్గర ఉన్నాను. 10 రోజుల నుంచి చావు నన్ను పిలుస్తోంది. అందుకే నేను చెరువులో దూకి చనిపోతున్నా. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నా చావు పాత ఇంటి దగ్గరే చేయండి. నెల రోజుల తర్వాత అంతా సర్దుకుంటుంది.’ అని ఆడియో రికార్డు చేసి కుటుంబ సభ్యులకు పంపించాడు. అనంతరం తన వద్ద ఉన్న వస్తువులను కట్టపై పెట్టి చెరువులో దూకాడు. సమాచారం అందుకున్న భార్య బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  చెరువు సమీపంలో సురేందర్​చెప్పులు, ఫోన్ కట్టపైన లభించాయి. పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్‌ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు.

Also Read: మైనార్టీలకు రేవంత్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 1.50 లక్షలు

 రాత్రి పొద్దుపోయే వరకూ చెరువులో గాలించినా సురేందర్‌ ఆచూకీ లభ్యం కాలేదు. భర్త ఆడియో రికార్డు విని కుటుంబ సభ్యులతో కలిసి చెరువు దగ్గరకు చేరుకున్న భార్య సంధ్యారాణి బోరున విలపించింది. చెరువులో గాలింపు చర్యలు జరుగుతుండగా.. కట్టపై కూర్చున్న ఆమె ఒక్కసారిగా చెరువులోకి దూకింది. భర్త మృతిని తట్టుకోలేక అదే చెరువులో దూకిన సురేందర్ భార్య సంధ్య. తన భర్తతో పాటే తనంటూ ఆమె చెరువులో దూకడంతో కుటుంబ సభ్యులు, అక్కడున్న స్థానికులు గట్టిగా అరిచారు. అక్కడే గాలింపు చర్యలు చేపడుతున్న  పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్‌ సిబ్బంది ఆమెను రక్షించారు. తండ్రి బలవన్మరణానికి పాల్పడటం, తల్లి చెరువులోకి దూకడంతో కుమారుడు బోరున విలపిస్తూ అమ్మ నువ్వు చచ్చి పోవద్దమ్మా అని రోదించడం  అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

Also read : TG Crime: ప్రాణం తీసిన పేకాట.. పోలీసులు రావడంతో పారిపోతుండగా హార్ట్ ఎటాక్!

Advertisment
తాజా కథనాలు