Yadagirigutta temple: యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు

తెలంగాణ లో ప్రముఖ అధ్యాత్మిక కేంద్రంగా, అద్భుత దేవాలయంగా పేరుగాంచిన యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అరుదైన అంత‌ర్జాతీయ గుర్తింపు లభించింది. గుట్ట ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందించారు. దీనికి సంబంధించిన ఆయన ఆలయ నిర్వాహకులకు లేఖ రాశారు.

New Update
Yadagirigutta Temple Nalgonda

Yadagirigutta Temple Nalgonda

Yadagirigutta : తెలంగాణ లో ప్రముఖ అధ్యాత్మిక కేంద్రంగా, అద్భుత దేవాలయంగా పేరుగాంచిన యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అరుదైన అంత‌ర్జాతీయ గుర్తింపు లభించింది. గుట్ట ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందించారు. దీనికి సంబంధించిన ఆయన ఆలయ నిర్వాహకులకు లేఖ రాశారు. కాగా యాదగిరిగుట్ట దేవాలయ అర్చకులు కెన‌డాలోని ఒట్టవా న‌గ‌రంలో ఉన్న ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామి దేవాల‌యంలో క‌ల్యాణం జరిపించారు. ఆ కళ్యాణాన్ని జ‌రిపించిన  తీరుతెన్నుల‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మిక‌త‌, ఐక్యతను ప్రశంసించారు. కెనడాలోని 4 రాష్ట్రాల్లో యాదగిరి గుట్ట ఆలయ నిర్వహకులచే ఈ నెల 27 వరకు  స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మార్క్ కార్నీ లేఖ‌ రాశారు.

ఇది కూడా చూడండి:LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు!

భారతీయ అధ్యాత్మి్కతను కెనడా ప్రధాని ప్రశంసించడం, అందులోనూ యాద‌గిరిగుట్ట ఆలయ సేవలను కీర్తించడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆల‌య ఈవో వెంక‌ట్రావు హ‌ర్షం వ్యక్తం చేశారు. స్వామివారి సేవ‌ల‌ను రానున్న రోజుల్లో విదేశీ భ‌క్తుల‌కు మరింత విస్తృతం చేస్తామని ఈవో వెంకట్రావు తెలిపారు. 

ఇది కూడా చూడండి:Missing Case: 3 రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. కట్‌ చేస్తే నదిలో మృతదేహాం

తెలంగాణలో యాద‌గిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణం తర్వాత భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఆలయ పునరాభివృద్ధిలో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని విస్తరించారు, కొత్తగా మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆలయానికి స్వర్ణగోపురం సైతం ఏర్పాటు చేశారు. దీనికోసం ఆలయ నిర్వాహకులు భక్తుల నుంచి విరాళాల రూపంలో ధనం, బంగారం సేకరించారు. దాదాపు 65 కేజీల బంగారంతో స్వర్ణ గోపురం రూపుదిద్దుకున్నది. ఇది పూర్తయిన తర్వాత యాదగిరిగుట్ట ఆలయం మరింత అద్భుతంగా, సుందరంగా తయారయింది. గతంలో ఆలయానికి వచ్చే భక్తులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు మెరుగైన సౌకర్యాలతో అన్ని రకాలగా ఈజీగా దర్శనం చేసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత  ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం తర్వాత మహిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం వల్ల సాధారణ రోజుల్లోనూ ఆలయానికి భారీగా మహిళా భక్తులు వస్తున్నారు.

Also Read :  Recording Dance : వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు..VIDEOS వైరల్

యాదగిరి గుట్టకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ నిర్వాహకులు భద్రతను కూడా మరింత పెంచారు. క్యూలైన్ల నిర్వహణ, అన్నదానం, తాగునీటి సౌకర్యాలు వంటి సౌకర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తాజా అంతర్జాతీయ గుర్తింపుతో యాద‌గిరిగుట్ట ఆలయం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందే అవకాశం లభించింది. భవిష్యత్తులో ఈ ఆలయం ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడ్డుతున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రయాణ సౌకర్యాలు, వసతి గృహాలు, ఇతర సౌకర్యాలను కూడా మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది.

Also Read: తల్లిని చంపి ఆత్మహత్య చేసుకోమన్న చాట్ GPT.. 2 ప్రాణాలు బలి తీసుకున్న AI

Advertisment
తాజా కథనాలు