Kavitha : బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు. బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్న కవిత ఈ నెల 25 నుంచి జనంబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో భాగంగా ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవితకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు. అయితే పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలని కవిత ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, జాగృతి నాయకులు
Posted by Telangana Jagruthi on Thursday, October 23, 2025
ఇంకా మాట్లాడుతూ తెలంగాణ జాగృతి సామాజిక సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాల గురించి తాను పుష్కలంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడాలంటే రాజకీయ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఒక వేళ తననుంచి పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తానన్నారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఆంధ్రలో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, కేరళలో అయితే గల్లీకి ఒక పార్టీ ఉందని గుర్తుచేశారు. అలాంటిది తెలంగాణలోనూ ఉండటంలో తప్పేం లేదని. అయితే పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదని... ఆయా పార్టీలతో ప్రజలకు మేలు జరగాలని కవిత ఆకాంక్షించారు.
కాగా తెలంగాణ జాగృతి చేపడతున్న కార్యక్రమాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే "జనం బాట' కార్యక్రమం నిర్వహిస్తున్నానని కవిత తెలిపారు. ఎల్లుండి నుంచి 4నెలల పాటు 'జనం బాట' కార్యక్రమం రాష్ర్ట వ్యాప్తంగా కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలను కలుస్తానని, వారి సమస్యలు తెలుసుకుంటానని వివరించారు. ఈ నెల 25న నిజామాబాద్ నుంచి ప్రారంభమయ్యే 'జనం బాట' కార్యక్రమం 33జిల్లాల్లో 4నెలలు పాటు జరుగుతుందని కవిత తెలిపారు. ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉంటానని.. అక్కడి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తానని వెల్లడించారు.
Kavitha : వారు కోరుకుంటే పార్టీ పెడుతా...పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు.
Kalvakuntla Kavitha