Amazon: అమెజాన్‌ గుడ్‌ న్యూస్‌..వారికి మార్చి వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్..

హెచ్‌1బీ ఉద్యోగులకు అమెజాన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వీసా ఇంటర్వ్యూల జాప్యం కారణంగా భారత్‌లో ఉండిపోయిన హెచ్-1బీ ఉద్యోగులకు మార్చి 2 వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. ఉద్యోగులకు అంతర్గత ప్రకటనలో అమెజాన్ ఈ విషయాన్నివెల్లడించింది.

New Update
14,000 layoffs in amazon

Amazon

H-1b Visaholders : హెచ్‌1బీ ఉద్యోగులకు అమెజాన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వీసా ఇంటర్వ్యూల జాప్యం కారణంగా భారత్‌లో ఉండిపోయిన హెచ్-1బీ ఉద్యోగులకు మార్చి 2 వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. ఉద్యోగులు ఆఫీసుకు తప్పనిసరిగా రావాలని మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు స్పష్టం చేసిన తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఉద్యోగులకు అంతర్గత ప్రకటనలో అమెజాన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. డిసెంబర్ 13 నుంచి భారత్‌లో వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూలింగ్ కోసం పలువురు హెచ్‌1 బీ వీసాదారులు వేచి చూస్తున్నారు. వారందిరికీ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతిస్తున్నట్టు అమెజాన్‌ తెలిపింది. మార్చి 2 వరకూ వారికి ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని తెలిపింది. అదే సమయంలో వారి కార్యకలాపాలపై కొన్ని పరిమితులు కూడా విధించింది. కస్టమర్లతో చర్చలు, కోడింగ్, వ్యూహాత్మక నిర్ణయాలు ఏవీ తీసుకోవడానికి వారికి అనుమతి లేదని తెలిపింది. కోడింగ్‌కు సంబంధించి సమస్యల పరిష్కారం, టెస్టింగ్ వంటివి చేపట్టేందుకు కూడా వారికి అనుమతి లేదు. అంతేకాకుండా, భారత్‌లో ఉన్న సమయంలో వారెవరూ ఇక్కడి అమెజాన్ సంస్థలకు వెళ్లకూడదని షరతు పెట్టింది. ఇక మార్చి 2 తరువాత వీసా అపాయింట్‌మెంట్స్ ఉన్న వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కాగా అమెరికాలో ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్-1బీ వీసా విధానంలో భారీ మార్పులు తీసుకువచ్చారు.  దీని మూలంగా పలు అమెరికా సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. అభ్యర్థులకు వీసా జారీ చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను తనిఖీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వీసా రెన్యూవల్స్‌కు సంబంధించిన అపాయింట్‌మెంట్ డేట్స్ జూన్ వరకూ వాయిదాపడ్డాయి. దీంతో, అమెరికా‌ను వీడొద్దంటూ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు తమ హెచ్-1బీ వీసా ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఈ తరుణంలో అమెజాన్‌ ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

Advertisment
తాజా కథనాలు