ఆఫీస్‌కు రావాల్సిందే.. ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన విప్రో.. లేకపోతే..

వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఫాలో అవుతున్న ఐటీ ఉద్యోగులను టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఆదేశించాయి. ఇప్పుడు విప్రో కూడా అదే బాటలో చేరిపోయింది. నవంబర్ 15 నుంచి వారానికి 3 రోజుల పాటు ఆఫీసుకు రావాలని తమ ఉద్యోగులకు ఆదేశించింది.

New Update
Wipro:విప్రోలో భారీగా ఉద్యోగావకాశాలు!.. ఇంకేందుకు ఆలస్యం మరి!

కరోనా సమయంలో ఐటీ కంపెనీల వర్క్ ఫ్రమ్‌ హోం విధానాన్ని పాటించగా.. ఇప్పటికీ కొన్ని కంపెనీలు దాన్నే ఫాలో అవుతున్నాయి. అయితే మరికొన్ని కంపెనీలు ఇంటినుంచి పనిచేసే ఉద్యోగులకు ఒక్కొక్కటి షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే TCS, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు తన సిబ్బందిని ఆఫీసు నుంచి పని చేయాలని ఆదేశించారు. అయితే ఇప్పుడు మరో భారతీయ సంస్థ ఇప్పుడు వాటి దారిలోనే నడుస్తోంది. వారంలో 3 రోజుల పాటు కార్యాలయాలకు తిరిగి రావాలని టెక్ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే ఈ హైబ్రిడ్ వర్క్ పాలసీని తప్పనిసరిగా అందరూ పాటించాలని కోరింది. ఇలాంటి విధానం 'మూన్ లైటింగ్' వంటి పలు ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చని టెక్ కంపెనీల ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల టీమ్ వర్క్ మెరుగుపడటంతో పాటు ఉద్యోగుల మధ్య మంచి సంబంధ పెంపొందుతుందని విప్రో కంపెనీ భావిస్తోంది. తమ సంస్కృతిని బలోపేతం చేయడమే మా లక్ష్యం' అని కంపెనీ చీఫ్ నుంచి విప్రో ఉద్యోగులకు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. పాలసీలో తీసుకొచ్చిన మార్పులు.. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఉపయోగపడతాయని సంస్థ భావిస్తోంది. ఇక వివిధ దేశాలు తమ స్థానిక నిబంధనలను పాటించేలా కొన్ని మార్పులు చేసినట్లు విప్రో చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని యూరోపియన్ దేశాల్లో కంపెనీ యాజమాన్యం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ పాలసీకి కట్టుబడి ఉండలేకపోతే జనవరి 7, 2024 నుంచి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: ఢిల్లీ వాయు కాలుష్యం గురించి స్పందించిన ఆనంద్‌ మహీంద్రా..ఈ పద్దతులు పాటించండి అంటూ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు