IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డెలాయిట్, HCL, టెక్ మహీంద్ర, KPMG, EY తదితర కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ సొంత ప్రదేశాలకు వెళ్లిపోవాలని సూచించాయి.

New Update
IND-PAK War Work From Home

IND-PAK War Work From Home

పాకిస్తాన్‌-ఇండియా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను భారీగా పెంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాక్ డ్రిల్స్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. 20కి పైగా ఎయిర్పోర్టులను సైతం ఇప్పటికే మూసివేశారు. పలు ప్రాంతాల్లో సాయంత్రం పూట ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా పలు పరీక్షలను రద్దు చేశారు. ఐపీఎల్ కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు ఐటీ కంపెనీలు సైతం కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా వర్క్ ఫ్రం హోంను ప్రారంభించాయి. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు అన్ని రకాల దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలను నిలిపివేయాలని ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసిన సూచనలలో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని హై అలర్ట్ జోన్ ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగుల కోసం ఈ భద్రతా మార్గదర్శకాలను జారీ చేశాయి ఆయా కంపెనీలు. ఉద్యోగులకు అత్యవసర సహాయం చేయడానికి ఆల్ ఇండియా కమాండ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాయి.

వర్క్ ఫ్రం ప్రకటించిన కంపెనీలు ఇవే..

దిగ్గజ కంపెనీలు అయిన డెలాయిట్, KPMG, EY, HCL, టెక్ మహీంద్రా తమ ఉద్యోగులకు WFH ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మరియు హై అలర్ట్ జోన్లలో నివసిస్తున్న నిపుణులను వెంటనే వారి ప్రదేశాలకు తిరిగి వెళ్లాలని ఆయా కంపెనీలు కోరినట్లు తెలుస్తోంది. ఉద్యోగులంతా ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని కోరినట్లు సమాచారం.

నోయిడాలో ప్రధాన కార్యాలయం ఉన్న దేశంలోని మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన హెచ్‌సిఎల్ టెక్.. చండీగఢ్, నోయిడా, గురుగ్రామ్‌లలో పనిచేస్తున్న తన ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలని సూచించింది. టెక్ మహీంద్రా మే 7న జారీ చేసిన అడ్వైజరీలో ప్రభుత్వ మార్గదర్శకాలన్నింటినీ పాటించాలని, రాబోయే 2 వారాల పాటు అన్ని రకాల అనవసరమైన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలను నివారించాలని పేర్కొంది. అయితే, ఈ కంపెనీ తన అడ్వైజరీలో వర్క్ ఫ్రం హోం గురించి స్పష్టంగా పేర్కొనలేదు. అయితే.. అవసరం అయిన ప్రాంతాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇన్ఫోసిస్‌లో కూడా..

దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులకు ఇంటి నుండే పని చేయాలని సూచనలు జారీ చేసింది. నెలలో 10 రోజులు లేదా వారంలో 3 రోజులు ఇంటి నుండి పని చేయవచ్చని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, జైపూర్ ప్రాంతాల్లోని తన ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి KPMG అనుమతించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, చండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్‌లోని ఉద్యోగులు ఇంటి నుండే పని చేయాలని EY సూచించింది. రానున్న రోజుల్లో మరికొన్ని కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

(work-from-home | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు