HYD Rain Update: రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా నగరంలోని ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్ ఇవ్వాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కంపెనీలకు సూచించారు. ఈ వర్షాల వల్ల ట్రాఫిక్ రద్దీ, రోడ్లపై నీరు నిలిచిపోవడం, రాకపోకలకు అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

New Update
Hyderabad Companies provide work from home facility

Hyderabad Companies provide work from home facility

గత రెండు మూడు వారాల నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. విద్యుత్ స్తంభించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తిండి తిప్పలు లేక అల్లాడిపోతున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించడంతో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఊహించని విపత్తు వరద రూపంలో ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. 

కాగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో వర్షం పడితే కొన్ని ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. నడుములోతు నీరు చేరి.. రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది. దీంతో ఉద్యోగస్తులు, ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లేవారు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, దుకాణా దారులు ఇంటికి చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు. 

మొన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, ఎస్ ఆర్ నగర్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట వంటి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇలా హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్లపై నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసే వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని.. అదే సమయంలో ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక సలహాలతో ప్రకటన జారీ చేశారు. వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఇంట్లో నుంచే పనిచేస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉంటుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. 

HYDలో వర్క్ ఫ్రం హోం

ఇవాళ అంటే ఆగస్టు 6న హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్ ఇవ్వాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కంపెనీలకు సూచించారు. ఈ వర్షాల వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటం, అనేక చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడం, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఐటీ, కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్ అవకాశం కల్పించాలని పోలీసులు కోరారు. 

దీని ద్వారా రోడ్లపై ట్రాఫిక్ భారం తగ్గుతుందని, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉంటుందని వారు తెలిపారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ట్రాఫిక్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ఈ సలహాను అనుసరించి, చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు