/rtv/media/media_files/2026/01/09/tcs-issues-key-warning-to-employees-no-hikes-and-no-promotions-if-they-choose-work-from-home-2026-01-09-13-45-01.jpg)
Tcs Issues Key Warning To Employees No Hikes And No Promotions If They choose work from home
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్(work-from-home) కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది. లేకపోతే యాన్యువల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ లాంటివి నిలిపివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో టీసీఎస్ ఉద్యోగులు ఇకనుంచి రోజుకు 9 గంటల పాటు పనిచేయాలి.
Also Read: కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించిన కోర్టు.. ఎందుకంటే ?
TCS Issues Key Warning To Employees
ఇతర ఐటీ కంపెనీలు చూసుకుంటే వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసుకు వచ్చే రూల్ ఉంది. గతంలో టీఎసీఎస్‌లో కూడా ఇలాంటి నిబంధనే ఉండేది. కానీ ఇకనుంచి అయిదు రోజులు కచ్చితంగా ఆఫీసుకు రావాలనే నిబంధన తీసుకొచ్చింది. అంతేకాక వేరియబుల్ పేను కూడా అటెండెన్స్‌తో అనుసంధానం చేసింది. అయితే కంపెనీ నిర్ణయంతో సంస్థలోని ఉద్యోగుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. పెరిగే జీతం కన్నా ఆఫీసుకు వెళ్లేందుకు అయ్యే ఖర్చు ఎక్కువైతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఇంటి అద్దెలు, రవాణా, భోజన ఇతర ఖర్చులన సాకుగా చూపిస్తున్నారు. చాలామంది వర్క్‌ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు చూపుతారు.
Also Read: గ్రీన్‌లాండ్ కొనుగోలు కోసం ట్రంప్ బిగ్‌ప్లాన్.. ప్రజలకు బంపర్ ఆఫర్
Follow Us