/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t072243-2026-01-22-07-25-37.jpg)
wife kills husband
Crime News: భార్యల అక్రమ సంబంధాలు భర్తల ఉసురుతీస్తున్నాయి. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న భర్తను కాటికి పంపించడం ఆధునిక భార్యలకు చాలా చిన్న విషయం అయిపోయింది. గడచిన రెండు మూడేళ్లుగా భార్యల చేతిలో భర్తలు అన్యాయంగా బలవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళితే...
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. కాగా లక్ష్మీమాధురి విజయవాడలో సినిమాహాల్లో టికెట్ కౌంటర్‌లో పనిచేసేది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం అయ్యింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే భర్త శివనాగరాజు చేస్తున్న ఉల్లిగడ్డల వ్యాపారం ఆమెకు నచ్చలేదు.నలుగురిలో నామోషీగా ఉందని భావించింది. దీంతో అతనితో ఉద్యోగం మాన్పించేసింది. తన ప్రియుడైన గోపి హైదరాబాద్‌లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తుండడంతో భర్తను అక్కడికి ఉద్యోగానికి పంపింది. నాగరాజు హైదరాబాద్‌లో ఉంటే గోపితో లక్ష్మీ మాధురి ఎంజాయ్ చేస్తుండేది.కొంతకాలం తర్వాత శివనాగరాజు హైదరాబాద్‌లో ఉండలేక చిలువూరు వచ్చేశాడు. తిరిగి ఉల్లిగడ్డల వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. శివనాగరాజు ఎక్కువగా ఇంటివద్ద నుంచే వ్యాపారం చేస్తుండడంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగా మారింది. ఆ వ్యాపారం నచ్చలేదని భర్తతో గొడవ పడేది.దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి.
ఎలాగైనా భర్త శివనాగరాజు అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాధురి భావించింది. ఈ నెల 18న రాత్రి లక్ష్మీ మాధురి బిర్యానీ వండింది. భర్తకు పెట్టే బిర్యానీలో 20 నిద్రమాత్రలు పొడిగా చేసి కలిపింది. బిర్యానీ తిన్న నాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అర్థరాత్రి 11.30 సమయంలో ప్రియుడు గోపికి పోన్ చేసి పిలిపించింది. నిద్రపోతున్న నాగరాజు ఛాతీపై గోపి కూర్చోగా మాధురి దిండుతో ముక్కుపై అదిమి నొక్కిపట్టింది. అతడు మృతిచెందాడని నిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాత్రంతా మాధురి ఒంటరిగా కూర్చుని ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఇరుగుపొరుగును పిలిచి.. గుండెనొప్పితో తన భర్త చనిపోయాడని హడావుడి చేసింది.
అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న వివాదాలు, ఆమె వివాహేతర సంబంధం గురించి తెలిసిన ఇరుగుపొరుగువారు అనుమానించారు. ఇక మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తారనగా నాగరాజు స్నేహితులు అక్కడికి వచ్చారు. అతని చెవిలో నుంచి రక్తం రావడం, చెవి వద్ద గాయం కనిపించడంతో అతని తండ్రితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఎస్సై వెంకటరవి కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నివేదికలో మృతుని ఛాతీ వద్ద ఎముకలు విరిగి ఉండడం, గాలి ఆడకుండా చేయడంతో చనిపోయాడని తేలడంతో పోలీసులు మాధురిని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. దీంతో ఆమెతో పాటు ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Follow Us