Wife Killed Husband: బురఖా ధరించి.. కత్తి ఎక్కుపెట్టి.. భర్తను లేపేసిన భార్య

మంగళూరులోని బంట్వాళ పట్టణంలో బట్టల దుకాణం యజమాని కృష్ణకుమార్ ను అతని భార్య జ్యోతి బురఖా వేసుకుని వచ్చి చంపిన సంఘటన సంచలనం రేపింది. బంట్వాళ పట్టణ నడిబొడ్డున.. ఉన్న బట్టల దుకాణంలోకి  బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

New Update
Wife kills husband

wife attacked husband

Karnataka: మంగళూరు(mangalore)లోని బంట్వాళ పట్టణంలో బట్టల దుకాణం యజమాని కృష్ణకుమార్ ను అతని భార్య జ్యోతి(karnataka Wife Ki**lls Husband) బురఖా వేసుకుని వచ్చి చంపిన సంఘటన సంచలనం రేపింది. బంట్వాళ పట్టణ నడిబొడ్డున.. ఉన్న  బట్టల దుకాణంలోకి  బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో కొనుగోలు దారులు పెద్దగా లేని సమయం. దుకాణ యజమాని కృష్ణకుమార్‌ అప్పుడే లెక్కలు సరిచూసుకుంటూ.. అక్కడి సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ఇంతలో  ఓ మహిళ షాపులోనికి ప్రవేశించింది. బురఖా ధరించి, నోటికి అడ్డుగా మాస్క్‌ వేసుకున్న ఆమె ఏవో దుస్తుల కోసం వెతుకుతున్నట్లు అక్కడ కలియతిరుగుతూ ఒక్కసారిగా కత్తి దూసింది. కృష్ణకుమార్‌పై దాడిచేసి, ఇష్టం వచ్చినట్లు పొడిచి పరుగులు తీసింది. అక్కడున్న వారు అప్రమత్తమై, బాధితుడిని ఓవైపు మంగళూరులోని ఏజే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా. మరికొందరు ఆమెను వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు.

Also Read :  12 ఏళ్ల బాలికను రేప్ చేసిన భూతవైద్యుడు.. తల్లిదండ్రులు ఉండగానే - ఛీఛీ

Karnataka Wife Killed Husband

సమాచారం అందుకున్న పోలీసులూ రంగంలోకి దిగి బంట్వాళ వీధుల్లో ఆమెకోసం గాలించారు. చివరికి బంట్వాళ వీధుల్లో పట్టుకున్నారు. ఠాణాకు తరలించి.. విచారించడంతో పాటు . బురఖా తొలగించి ఆమె అసలు రూపం చూసి ఖంగుతిన్నారు. ఎందుకంటే ఆమె మరెవ్వరో కాదు.. కృష్ణకుమార్‌ సతీమణి కేటీ జ్యోతి! ఆమెను చూసి పోలీసులు, దుకాణ సిబ్బంది నోరెళ్లబెట్టారు. కుటుంబంలో పలు వివాదాలు ఉండడంతోనే దాడి చేసిందని గుర్తించారు.  విచారణ కొనసాగిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.  కుటుంబ వివాదాలు కారణంగానే భర్తను చంపే ప్రయత్నం చేసినట్లు జ్యోతి తెలిపింది. - wife-killed-husband

Also Read :  ఓటమి తర్వాత తొలిసారిగా స్పందించిన తేజస్వీ యాదవ్

Advertisment
తాజా కథనాలు