Wife Kills Husband: మరో భర్తకు మూడింది.. తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను (38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సికి 17ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా తమ్ముడి సాయంతో భర్తను కళ్లలో కారం కొట్టి ఓ భార్య పొడిచి చంపింది.

New Update
FotoJet (3)

wife kills husband

Crime News: భార్యల అక్రమ సంబంధాలు(Illegal Affair) భర్తల ప్రాణాల మీదకు వస్తున్నాయి. ఇతరులతో ఉన్న వివాహేతర సంబంధాలు భర్తలకు తెలియడంతో కట్టుకున్నవారిని కనికరం లేకుండా ఖతం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు భార్యభర్తల అనుబంధానికి చెరగని మచ్చగా మిగిలిపోతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల పరిధిలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా తమ్ముడి సాయంతో భర్తను కళ్లలో కారం కొట్టి ఓ భార్య హత్య చేసింది.  

Also Read :  ఏపీలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహ**త్య!

17 ఏండ్ల విహహబంధాన్ని కాదని..

ప్రకాశం జిల్లా(Prakasham District) పెద్దారవీడు మండలం దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను(38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సికి 17ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. లాలు శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అతడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కడంతో ఒంగోలు జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. అప్పటికే ఝాన్సీకి తన తమ్ముడి స్నేహితుడు అయిన జమ్మిదోర్నాలకు చెందిన కారు డ్రైవర్‌సూర్యనారాయణతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే ఈ విషయం తెలిసిన శ్రీను రిమాండ్‌లో ఉన్న సమయంలో తనను కలిసేందుకు వచ్చిన భార్యను, తమ్ముడిని బయటకు వచ్చిన తర్వాత  చంపేస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో బయపడినవారు తామే అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం గుంటూరుకు చెందిన మరో నలుగురితో రూ. రెండు లక్షలు సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు.  - Wife Kills Husband

Also Read :  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు... విచారణకు కేటీఆర్‌.. ఆ విషయం పైనే ఎంక్వయిరీ?

రెండు సార్లు ఫెయిల్‌..

కాగా శ్రీను బెయిల్‌ పై విడుదలై ఒంగోలు నుంచి వస్తున్న క్రమంలో ముందుగా అనుకున్న ప్రకారం చీమకుర్తి, పొదిలి వద్ద చంపాలని ప్లాన్‌ చేసుకున్నప్పటికీ అది కురదలేదు. చివరకు పెద్దారవీడు అంకాలమ్మ గుడి సమీపంలో మూత్ర విసర్జనకు కారు ఆపాలని కోరారు. కారులో తమ్ముడు, భార్య ఝాన్సీ పథకం ప్రకారం వేచి ఉండగా వెనుక బండిపై వచ్చిన సూర్యనారాయణ, అతని స్నేహితులు మృతుడి కళ్లలో కారం కొట్టగా, కారులో వెంటతెచ్చుకున్న కత్తితో భార్య, ఆమె తమ్ముడు పొడిచారు(wife-killed-husband). దీంతో  లాలుశ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం భార్య, తమ్ముడు లొంగిపోతే  మేం బయట ఉండి బెయిల్‌పై తెస్తామని ఇతర నిందితులు వారికి చెప్పడంతో ఝాన్సీ, ఆమె తమ్ముడు పోలీసులకు లొంగిపోయారు. కాగా వారిని  అదుపులోకి తీసుకున్న పోలీసులు  విచారణ చేపట్టగా అసలు విషయం బయటకు వచ్చింది.  మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుని కోర్డులో హాజరు పరుస్తామని డీఎస్పీ నాగరాజు తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు