Crime : వివాహేతర సంబంధం..భార్యల చేతిలో భర్తలు బలి

వివాహేతర సంబంధాలతో భర్తలను చంపుతున్నభార్యల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. నేడు భార్యభర్తలే ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఏ రాత్రి ఎవరిచేతిలో ఎవరు చస్తారో తెలియని పరిస్థితి. తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని భర్తలను లేపేశారు ఇద్దరు మహిళామణులు.

New Update
Wife Killed Husband

Wife Killed Husband

Crime: వివాహేతర సంబంధాలతో భర్తలను చంపుతున్న భార్యల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు దంపతులంటే ప్రేమ, అనురాగాలకు ప్రతీకగా నిలిచేవారు. నేడు భార్యభర్తలే ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఏ రాత్రి ఎవరిచేతిలో ఎవరు చస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని భర్తలను లేపేశారు ఇద్దరు మహిళామణులు. తాజాగా ఇలాంటి ఘటనలే రాష్ట్రంలో రెండు చోటుచేసుకున్నాయి.  ప్రియుడితో కలిసి కట్టుకన్న భర్తలను భార్యలు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే...

ఇనుపరాడ్‌తో కొట్టి...

నాచారం ఠాణా  సీఐ ధనుంజయ తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన నారాయణ బెహరా(32), బంధిత బెహరా(27) భార్యాభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఓల్ట్‌మీర్‌పేట్‌ శాంతినగర్‌లో ఉంటున్నారు. నారాయణ బెహరా ప్లంబర్‌గా పనిచేస్తుండగా,  బంధిత ఎన్‌ఏఫ్‌సీ కంపెనీలో స్వీపర్‌గా పనిచేస్తుంది. బీహార్‌కు చెందిన విద్యాసాగర్‌(25) మల్లాపూర్‌ శాంతినగర్‌లో ఉంటూ వెల్డర్‌గా పని చేస్తున్నాడు. నారాయణ, విద్యాసాగర్‌ ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో ఇద్దరిమధ్య స్నేహం ఏర్పడింది. తరుచుగా ఇద్దరూ మద్యం తాగేవారు. ఈ క్రమంలో బంధితకు, విద్యాసాగర్‌కు మధ్య వివాహేతర బంధం ఏర్పడింది.

FotoJet (73)

అయితే వారి బంధానికి అడ్డుగా ఉన్న నారాయణ బెహరాను హత్య చేయాలని పథకం పన్నారు. గురువారం రాత్రి నారాయణ, విద్యాసాగర్‌ కలిసి మల్లాపూర్‌లోని వైన్స్‌ వద్ద మద్యం తాగారు. అర్ధరాత్రి ఇంటికొచ్చిన నారాయణకు బంధితకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే బంధిత, ప్రియుడితో కలిసి ఇనుపరాడ్డుతో భర్తను తలపై కొట్టడంతో మృతిచెందాడు.  ప్రమాదవశాత్తు మద్యం తాగి కిందపడి మృతిచెందాడని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు 24గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. భర్తను ప్రియుడితో కలిసి చంపినట్లు బంధిత  పోలీసులు ముందు నేరాన్ని అంగీకరించింది. 

23 ఏళ్ల యువకుడితో ఎఫైర్..

మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో మరో ఘటనలో  ప్రియుడితో కలిసి భర్త స్వామి (35)ని భార్య మౌనిక (28) హత్య చేసింది. అంతటితో ఆగకుండా ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలకు తెరలేపింది. మద్యం మత్తులో చెరువులో పడి భర్త చనిపోయినట్లు బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే స్వామి మృతిపై అనుమానాలు వ్యక్తి చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మెదక్ జిల్లా పోలీసులు అసలు నిజాలను బయటపెట్టారు. తూప్రాన్‌ సీఐ రంగాకృష్ణ, ఎస్సై మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన బుల్లెబోయిన స్వామి అరవింద పరిశ్రమలో ఫైర్‌ ఇంజిన్‌ డ్రెవర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 23న గ్రామ శివారులోని నేరళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మౌనిక చెప్పిన మాటలను తొలుత స్వామి బంధువులు నమ్మారు. అయితే రాను రాను మౌనిక ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించారు. 

FotoJet (74)

దీంతో స్వామి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వామి అనుమానస్పద మృతికి గల కారణాలను పోలీసులు విచారించారు. కాగా, విచారణలో  విస్తుపోయే నిజాలు తెలిశాయి. దీని ప్రకారం.. స్వామి, మౌనికలకు 12 ఏళ్ల క్రితమే వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మౌనికకు తనకంటే తక్కువ వయసున్న సంపత్ (23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విషయం స్వామికి తెలియడంతో మౌనికతో గొడవపడ్డాడు. పంచాయతీ పెడతానని హెచ్చరించాడు. దీంతో భర్తను ఎలాగైన చంపాలని మౌనిక నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం తీసుకుంది. గత నెల 23న మద్యం తాగి స్వామి ఇంటికి రాగా.. భర్తను చంపేందుకు ఇదే మంచి ఛాన్స్ అని ప్రియుడికి ఫోన్ చేసి.. ఇంటికి పిలిపించింది. అతడి సాయంతో భర్త స్వామి గొంతు నులిమి ప్రాణాలు తీసింది. అనంతరం ప్రియుడితో కలిసి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి నెరేళ్ల కుంటలో పడేసింది. ఆపై మద్యం మత్తులో నీటిలో పడి చనిపోయినట్లు బంధువులందరికీ సమాచారం ఇచ్చింది. పోలీసుల విచారణలో భర్తను ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో మౌనిక, సంపత్ ను పోలీసుల అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.

Advertisment
తాజా కథనాలు