Wife Killed Husband: వ్యక్తి అనుమానాస్పద మృతి.. బోడమంచ తండాలో ఉద్రిక్తత

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాకు చెందిన భూక్య వీరన్న మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. వీరన్న మృతికి ప్రతీకారంగా బుధవారం ఉదయం తండావాసులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

New Update
FotoJet (1)

Suspicious death of a person.. Tension in the Bodamancha gang

Crime News : మహబూబాబాద్ జిల్లా(mahaboobabad) కేసముద్రం మండలం బోడమంచ తండాకు చెందిన భూక్య వీరన్న మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి వీరన్న కు ఫోన్ రావడంతో ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి నుంచి  ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లాడు.  అయితే అర్ధరాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళుతున్న ఓ వ్యక్తి  తండా సమీపంలో వీరన్న మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు వీరన్న తలపై తీవ్ర గాయాలు ఉండడంతోపాటు, సమీపంలోని వరి పొలంలో రక్తపు మరకలు ఉండడాన్ని గుర్తించారు.  వీరన్నను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ చేపట్టారు. - wife-killed-husband

Also Read :  ఒక్కో గ్రామానికి రూ.10 లక్షలు.. కొత్త సర్పంచ్ లకు సీఎం రేవంత్ న్యూ ఇయర్ గిఫ్ట్!

గ్రామంలో ఉద్రిక్తత

కాగా. వీరన్న మృతితో బోడమంచతండాలో ఉద్రిక్తత నెలకొంది. భూక్యా వీరన్న (45)  అనుమానాస్పద రీతిలో మృతి చెందగా అతడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని స్థానికులు ఆరోపించారు. వీరన్న మృతికి ప్రతీకారంగా బుధవారం ఉదయం తండావాసులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అనుమానితులుగా భావిస్తూ ఆర్‌ఎంపీ భరత్‌, బోడ బాలుల  ఇళ్ల ముట్టడించారు. ఈ క్రమంలో ఆర్‌ఎంపీ బైక్‌, ఓ షాపును తగులబెట్టడంతో పాటు బాలు ఇంటిని ధ్వంసం చేశారు. ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో తండా వాసులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. అనుమానితులతో పాటు మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బోడమంచతండాలో భారీగా పోలీసులు మోహరించారు.  కేసముద్రం ఎస్సైలు క్రాంతి కిరణ్, నరేష్ లు వారి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అది హత్యనా లేదా సాధారణ మరణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

వీరన్న మృతికి ప్రతీకారంగా బుధవారం ఉదయం తండావాసులు ఆందోళనకు దిగారు. అనుమానితులుగా భావిస్తూ ఆర్‌ఎంపీ భరత్‌, బోడ బాలు ఇళ్ల ముట్టడికి వెళ్లారు. ఈ క్రమంలో ఆర్‌ఎంపీ బైక్‌, ఓ షాపును తగులబెట్టారు. బాలు ఇంటిని ధ్వంసం చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అడ్డుకోవడంతో తండా వాసులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనుమానితులతో పాటు మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బోడమంచతండాలో భారీగా పోలీసులు మోహరించారు.

Also Read :  సహకార సంఘాలకు బిగ్‌ షాక్‌.. నో ఎలక్షన్స్‌.. ఓన్లీ నామినేటెడ్

ట్విస్ట్‌ ఏంటంటే?

పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరన్నను కట్టుకున్న భార్యే హత్య(wife-killed-her-husband) చేయించినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రియుడితో కలిసి భార్య విజయే భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భార్య విజయ, ఆమె ప్రియుడు ఆర్ఎంపీ డాక్టర్ భరత్ వీరన్నను హత్య చేసి ఆపై ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించినట్లు తెలిపారు. మృతుడి పేరుపై ముందే రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ కూడా చేయించినట్లు తెలిసింది. ఈ కారణంగానే భర్తను దారుణంగా హత్య చేసినట్లు విచారణలో పోలీసులు తేల్చారు.

Advertisment
తాజా కథనాలు