Tourist boat capsizes: టూరిస్ట్ బోటు బోల్తాబడి ఇద్దరు మహిళలు మృతి
వికారాబాద్ జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. సర్పన్పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల బోటు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు పర్యటకులు ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.