Tourist boat capsizes: టూరిస్ట్ బోటు బోల్తాబడి ఇద్దరు మహిళలు మృతి

వికారాబాద్‌ జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల బోటు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు పర్యటకులు ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.

New Update
boat 123

వికారాబాద్‌ జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల బోటు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో నలుగురు పర్యటకులు ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.

హైదరాబాద్‌కు చెందిన ఫ్యామిలీ ప్రాజెక్టు సమీపంలోని రిసార్ట్‌కు టూర్‌కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు పడవలో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో రితిక (44), పూనమ్‌(50) మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా బోట్లు నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక ఘటనలు జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబం బిహార్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లోని మియాపుర్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు