BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన టూరిస్టులు పరిగిలో జరిగిన విందుకు బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

New Update
Accident

Accident

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు

విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా..

పరిగిలో జరిగిన ఓ విందుకు పలువురు టూరిస్టు బస్సులో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉండగా.. దాన్ని బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు చికిత్స తీసుకుంటుండగా మృతి చెందారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్‌‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?

ఇదిలా ఉండగా ఏపీ నంద్యాల జిల్లాలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన సంతోష్‌(47), లోకేశ్‌ (37), నవీన్‌ (37)గా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం, మహానంది ఆలయాలు దర్శించుకుని డోన్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

ఇక పోతే తెలంగాణలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు మ‌ృతి చెందారు. ఇంకా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. చెట్టుపెల్లి శ్వేత (40), నూగ దుర్గ (38) మృతులుగా గుర్తించారు. మేడారం వెళ్లి ట్రాక్టర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇలా వేర్వేరే ప్రాంతాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు.

ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..

 

telangana | road-accident | vikarabad

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు