/rtv/media/media_files/2025/08/06/husband-and-sister-2025-08-06-06-59-10.jpg)
వికారాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. బావిలో దూకిన భార్యను కాపాడబోయి భర్త, భార్య చెల్లెలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోమిన్‌పేట మండలం చీమలదరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లికి చెందిన గగ్గొల్ల మాసయ్య, భార్య అలివేలుతో కలిసి కొన్ని నెలలుగా చీమలదరి సమీపంలోని వెంచరులో కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో పెద్ద గొడవే జరిగింది. దీంతో అలివేలు ఆత్మహత్య చేసుకునేందుకు దగ్గరలోని వ్యవసాయ బావిలో దూకేసింది. ఆమెను కాపాడేందుకు మాసయ్య(58), అలివేలు సోదరి బొల్లె నాగమ్మ(45) ఇద్దరూ బావిలోకి దూకారు. వారి కేకలు విన్న కూలీ పనులు చేసే ప్రసాద్ వెంటనే బావిలోకి దూకి అలివేలును కాపాడి బయటికి తీశాడు. అయితే మాసయ్య, నాగమ్మ మాత్రం నీటిలో మునిగిపోయారు. దీంతో వారిని కాపాడలేకపోయాడు.
Also read : Srushti Fertility Centre : సృష్టి కేసులో సంచలన విషయాలు.. ఆ గ్యాంగులతో నమ్రతకు లింకు
బిగ్ ట్విస్ట్ ఏంటంటే
అలివేలును వెంటనే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మాసయ్య, బొల్లె నాగమ్మ మృతదేహాలను వికారాబాద్ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి బయటకు తీశారు. ఈ ఘటనలో బిగ్ ట్విస్ట్ ఏంటంటే... నాగర్‌కర్నూల్ జిల్లా డిండి మండలం పొన్ననాగులకు చెందిన బొల్లె నాగమ్మ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చింది. బాలానగర్ సమీపంలోని చింతల్‌కు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే వారం రోజుల కిందట నాగమ్మ అనారోగ్యానికి గురైందని అక్క అలివేలను ఆసుపత్రిలో చూపిస్తానని చీమలదరిలోని వెంచరు వద్దకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో నాగమ్మ అక్కను కాపాడబోయి తాను చనిపోయింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
తొమ్మిదేళ్ల బాలికపై
వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి, తొమ్మిదేళ్ల బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారయత్నం చేయడంతో బాలిక భయంతో వణికిపోయింది. చన్గోముల్ నేవీ రాడార్ స్టేషన్‌లో బాధిత బాలిక తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తున్నారు. అదే ప్రాంగణంలో నిందితుడు కూడా కూలీ పనిచేస్తున్నాడు. అయితే బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఆమె ఒక్కతే ఉండడాన్ని నిందితుడు గమనించిన నిందితుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. భయపడిన బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా భయంతో బాలిక వణికిపోవడంతో బాలికను కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.