/rtv/media/media_files/2025/07/22/wife-kills-husband-with-father-2025-07-22-08-58-26.jpg)
Wife kills husband with father
Crime News: చిన్నచిన్న కారణాలతో భర్తలను చంపుతున్న భార్యల ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజాగా తండ్రితో కలిసి భార్య తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో చోటుచేసుకుంది. తాండూరు రూరల్ సీఐ నగేశ్ తెలిపిన వివరాల ప్రకారం.మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్ తాండూర్ నాపరాయి గనుల్లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడికి పదేండ్ల క్రితం కొత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో పెండ్లయింది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరుచుగా గొడవలు అవుతున్నాయి. దీంతో మూడేళ్ల క్రితం జయశ్రీ భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. నెలన్నర క్రితమే వెంకటేశ్ గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి భార్యాపిల్లలను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అయితే భార్యభర్తల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి.
ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
ఇదిలా ఉండగా ఆదివారం భార్యభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆ తర్వాత వెంకటేష్ నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటాక భార్య జయశ్రీ..తన తండ్రితో కలిసి వెంకటేష్‌ను చంపాలని నిర్ణయించుకుంది. జయశ్రీ వెంకటేష్ చేతులు పట్టుకోగా, ఆమె తండ్రి పండరి అల్లుడి గొంతు నులిమి హతమార్చాడు. మరునాడు ఉదయం వెంకటేష్ అనారోగ్యానికి గురైనట్లు నమ్మించడానికి హతుడిని ఆసుపత్రికి తరలించేందుకు ఆటో తీసుకొచ్చారు. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్ నిరాకరించాడు. ఇంతలో పక్కింట్లో ఉండే బాధితుడి తల్లి, సోదరులు అక్కడికి చేరుకొన్నారు. వెంకటేష్ మృతిచెందిన స్థితిలో ఉండటంతో వారిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపారు. హతుడి తల్లి అంజిలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, జయశ్రీ, పండరిలను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. ఘటనా స్థలాన్ని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పరిశీలించి హత్యకు గల కారణాలను ఎంక్వరీ చేశారు.
ఇది కూడా చూడండి:Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్