సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు NOC జారీ.. ఆమోదించిన ఛత్తీస్గఢ్ సీఎం
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ధాన్యం దిగుబడే నిదర్శమన్నారు. శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. దీనివల్ల 80 శాతం మంది పేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీలో ఏదైనా తేడా జరిగితే కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులను హెచ్చరించారు.
కృష్ణ నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కు వారు ఫిర్యాదు చేశారు.
SLBC సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లోనే ఈ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను తరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలడం సంచలనం రేపుతోంది. మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కెసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరంతో 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. మేడిగడ్డ బ్యారేజి కుంగిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవట్లేదని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ త్వరలోనే కొత్త తెల్ల రేషన్ కార్డులు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్డుల మంజూరుకు సంబంధించి కేబినెట్ మీటింగ్లో విధి విధానాలు రూపొందించినట్లు చెప్పారు. కార్డు దారులందరికీ 3నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.