BIG BREAKING: ఇదేం పద్ధతి.. చంద్రబాబు సర్కార్ పై కేంద్రానికి సీఎం రేవంత్ కంప్లైంట్!

కృష్ణ నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కు వారు ఫిర్యాదు చేశారు.

author-image
By Nikhil
New Update
TS CM Revanth Reddy AP CM Chandrababu

కృష్ణ నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కు వారు ఫిర్యాదు చేశారు. నేడు ఢిల్లీలో సీఆర్ పాటిల్ తో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. ఈ సందర్భంగా తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గోదావరి నది జలాల విషయంలో తెలంగాణ ప్రాజెక్టుల లెక్క తేలిన తర్వాతనే మిగులు జలాలను ఏపీ వినియోగించుకోవాలన్నారు. మొదట తెలంగాణ గోదావరి నది జలాలను వినియోగించుకున్న తర్వాతనే మిగులు జలాలను ఏపీ వినియోగించుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి: Addanki Dayakar: నాకు MLC రాకుండా అడ్డుకోవద్దు ప్లీజ్.. జానారెడ్డి, కోమటిరెడ్డితో అద్దంకి కీలక భేటీ!

తెలంగాణకు తీవ్ర అన్యాయం..

కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీరు ఉపయోగించుకుంటుందన్నారు. ఈ విషయమై తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు. పోలవరం బనకచర్ల అనుసంధానం పై అభ్యంతరాలు వ్యక్తం చేశామన్నారు. ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రమంత్రి చెప్పారన్నారు. తమ అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి తమకు చెప్పారన్నారు. కృష్ణా నది జలాల వివాద ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరినట్లు ఉత్తమ్ వివరించారు.
ఇది కూడా చదవండి: MLC ELECTIONS 2025: కమ్యూనిస్టులకు ఒక ఎమ్మెల్సీ సీటు.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం?

శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టుల్లో టెలీ మెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే తెలంగాణ, ఆంధ్రా వాటా ఖర్చు కూడా తామే భరిస్తామని చెప్పామన్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరామన్నారు. NDSA - నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నుంచి మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై నివేదిక త్వరగా ఇవ్వాలని కోరామన్నారు.

తెలంగాణ జల వనరుల విషయంలో సీఎం రేవంత్, తాను కేంద్రం వద్ద రాష్ట్ర వాదనలు బలంగా వినిపించినట్లు వివరించారు. కృష్ణా జలాల వివాదంలో రోజువారీగా జోక్యం చేసుకుంటామని కేంద్రం తమకు హామీ ఇచ్చిందని వివరించారు. దీర్ఘకాలికంగా సాగుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని కోరామన్నారు.  

Advertisment
తాజా కథనాలు