Telangana: ధాన్యం దిగుబడిలో తెలంగాణ టాప్.. ఉత్తమ్ కీలక ప్రకటన

ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ధాన్యం దిగుబడే నిదర్శమన్నారు. శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

New Update
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ధాన్యం దిగుబడే నిదర్శమన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సమీక్ష చేశారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు.   

Also Read: నాకు ఒక్క అవకాశం ఇస్తే.. పహల్గాం టెర్రర్ అటాక్‌పై కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు

Uttam Kumar Reddy Comments On Crop Yield

ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయడం చరిత్రాత్మక అంశం. అరులైన వాళ్లందరికీ ఫ్రీగానే సన్నబియ్యం పంపిణీ చేస్తాం. అలాగే దేవాదుల ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం. మేము అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖను ప్రక్షాళన చేస్తున్నాం. ఈ శాఖలో అన్ని సమస్యలను రెండేళ్లలో పరిష్కరిస్తాం. సీతమ్మసాగర్‌కు 68 టీఎంసీల గోదావరి జలాలు కేటాయించాం. కేంద్ర ప్రభుత్వంతో అనేకసార్లు చర్చించి నీటి వాటాను దక్కించుకున్నామని'' ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

Also Read: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. ప్రజల దృష్టి మార్చేందుకే ఉగ్రదాడికి దిగిందా ?

మరోవైపు రేషన్ కార్డు దారులకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు లైన్ క్లియర్ అయ్యింది. కొత్త దరఖాస్తులకు అప్లై చేసుకోవాలనుకునే వారికి మే నెలా కోటాను కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 కోట్ల మంది రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను కూడా క్లియర్ చేశారు. దాదాపుగా 20 శాతం పెండింగ్ దరఖాస్తులను పరిష్కారం చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొత్త సభ్యులను చేర్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో రెండు రకాలుగా రేషన్ కార్డును జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Also Read: పహల్గాం ఉగ్రదాడి.. చిక్కిన అనుమానితులు?

ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

uttam-kumar | telangana | rtv-news | ration-cards

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు