Telangana: కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తోంది.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను తరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

New Update
Uttam kumar Reddy

Uttam kumar Reddy

నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను తరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం కేంద్ర జలశక్తి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా తెలంగాణలో నీటి నిల్వ సదుపాయాలు, అలాగే నీటి సరఫరా నిర్వహణ గురించి వివరించారు. పలు సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్రాన్ని కోరారు. 

Also Read: అది నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి దీదీ సవాల్

'' కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కగట్టేందుకు టెలిమెట్రీని కేంద్రం ఏర్పాటు చేయాలి. 55 కి.మీ పొడవున చేపడుతున్న మూసీ పునరుజ్జీవ, అభివృద్ధి ప్రాజెక్టుకు నిధలివ్వాలని కోరుతున్నాం. గంగా, యమునా నదుల తరహాలోనే మూసీ పునరుద్ధరణ, అభివృద్ధికి సహకారం అందించాలి. మూసీ వెంబడి ట్రంక్, సీవరేజ్‌ నెట్‌వర్క్‌ కోసం రూ.4 వేల కోట్లు కేటాయించాలి. గోదావరి జలాలను తరలించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్‌ సాగర్‌కు రూ.6 వేల కోట్లు ఇవ్వాలి.  

Also Read: త్వరలో క్యాన్సర్‌కు టీకా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా ట్రైబ్యుల్ తీర్పు త్వరగా వచ్చేలా చొరవ తీసుకోని తెలంగాణకు న్యాయం చేయాలి. పాలమూరు-రంగారెడ్డి , సీతారామసాగర్, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. అలాగే సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలి. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల్లో పూడికతీతకు ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలి. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి NDSA విచారణ నివేదిక త్వరగా ఇవ్వాలని'' ఉత్తమ్ కుమార్‌ అన్నారు.    

Also Read: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్‌ టెస్టులు ఫ్రీ

Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్‌ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు