🔴Live Breakings: స్టార్ షిప్ ఎఫెక్ట్.. 240 విమానాల రాకపోకలకు అంతరాయం
వైరల్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
వైరల్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ కేసును పోలీసులు ఛేదించారు. తమ బంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన తల్లీ, సోదరిని హతమార్చినట్లు పోలీసుల విచారణ తేలింది.
జగిత్యాల జిల్లాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో పెళ్ళికొడుకు కిరణ్ పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
హ్యుందాయ్ కార్ల కంపెనీ తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వెన్యూపై రూ. 55,000, i20 పై రూ. 50,000, గ్రాండ్ i10 NIOSపై రూ. 53,000, SUV ఎక్స్టర్పై రూ.35,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
వరుసగా 15వరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. పనుల్లో మరింత వేగం పెంచేందుకు సింగరేణి నుంచి అదనపు కార్మికులను పిలిపించారు. దీనిపై మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. అలాగే మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడనున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఈరోజు మహిళలే ఆపరేట్ చేస్తున్నారు. వివిధ రంగాల్లో సక్సెసైన ఉమెన్ అచీవర్స్ మోదీ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాండిల్ చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం 2020లో కూడా మోదీ ఇలానే చేశారు.
ఇందిరమ్మ ఇళ్ళపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. మరో వారం రోజుల్లో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి..పనులు మొదలుపెడతామని తెలిపారు.
హైదరాబాద్ లోని తాజా కిచెన్, అమోఘ్, ఫోర్ సీజన్స్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బొద్దింకలు, ఎముకలు కూడా తిరగడం చూసి అధికారులు షాక్ అయ్యారు.