/rtv/media/media_files/2025/03/08/r0sMSp7KdduzrK3fpC3u.jpg)
Hyundai and Tata Big Car Discount in March
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hundai) తన కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లను ప్రకటించింది. మార్చి 31 లోపు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి అదిరిపోయే తగ్గింపులు అందస్తోంది. ఇప్పటికే టాటా మోటార్స్ కూడా తన కార్లపై భారీ డిస్కౌంట్లను అందించింది. ఇక ఇప్పుడు హ్యుందాయ్ వంతు వచ్చింది. తన కొన్ని కార్లపై హ్యుందాం భారీ డిస్కౌంట్లను అందించింది. అందువల్ల ఈ నెలలో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లైతే ఇదే సరైన అవకాశం.
Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే
Hyundai Car Discounts
ఈ నెలలో హ్యుందాయ్ కారు కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ నెలలో కంపెనీ హ్యుందాయ్ కాంపాక్ట్ SUV వెన్యూపై రూ. 55,000 వరకు తగ్గింపు అందిస్తోంది. హ్యుందాయ్ i20 పై రూ. 50,000 వరకు తగ్గింపు పొందొచ్చు. హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOSపై రూ. 53,000 తగ్గింపు లభిస్తుంది. హ్యుందాయ్ కాంపాక్ట్ SUV ఎక్స్‌టర్‌పై రూ.35,000 డిస్కౌంట్ పొందొచ్చు.
Drive into March with incredible deals!
— Hyundai India (@HyundaiIndia) March 6, 2025
Hyundai presents Super Delight March. Enjoy amazing benefits on your favourite Hyundai cars. Hurry! Offer valid till 31st March, 2025.#Hyundai #HyundaiIndia #ILoveHyundai #SuperDelightMarch25 pic.twitter.com/NSTlpFubXi
అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఈ అన్ని డిస్కౌంట్లు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఈ డిస్కౌంట్లపై మరిన్ని వివరాల కోసం సమీప హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. కొంతమంది డీలర్ల వద్ద 2024 సంవత్సరానికి సంబంధించిన మొత్తం స్టాక్ ఇప్పటికీ ఉంది. దానిని క్లియర్ చేయడానికి భారీ డిస్కౌంట్లు ఇవ్వబడుతున్నాయి.
Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!
మార్కెట్ వాటా డౌన్
కాగా హ్యుందాయ్ గతేడాది 2024 ఫిబ్రవరి 2024లో 47,540 వాహనాలు సేల్ చేసింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 2025లో కేవలం 38,156 వాహనాలను మాత్రమే విక్రయించింది. దీని బట్టి చూస్తే ఇది 20 శాతం అమ్మాకాలు తగ్గాయి. ఈ తగ్గుదల కారణంగా, హ్యుందాయ్ మార్కెట్ వాటా 14.05% నుండి 12.58%కి పడిపోయింది. అదే సమయంలో చాలా కాలం నుంచి రెండో ప్లేస్‌లో ఉన్న హ్యుందాయ్ ఇప్పుడు మరింత కిందికి పడిపోయింది.
Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?
టాటా కార్లపై డిస్కౌంట్
టాటా మోటార్స్ (Tata Motors) కూడా మార్చిలో భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ నెలలో టాటా హారియర్, సఫారీలపై రూ. 75,000 వరకు తగ్గింపు ప్రకటించింది. అలాగే 2025 మోడల్‌పై రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఈ డిస్కౌంట్‌లో క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్ వంటివి ఉన్నాయి. దీనితో పాటు టియాగోపై రూ.45,000 వరకు డిస్కౌంట్, ఆల్ట్రోజ్‌పై రూ.1.35 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఇవ్వబడుతోంది. ఇంకా టాటా కర్వ్‌పై రూ.30,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్లు ప్రస్తుతం 2024 మోడల్‌పై ఉన్నాయి.