Road Accident : ఎక్సైజ్ పోలీసుల అత్యుత్సాహం యువకుడు మృతి...

కాకినాడ జిల్లా ఎక్సైజ్‌ సిబ్బంది అత్యుత్సాహం ఒక యువకుడి నిండు ప్రాణం తీయగా,మరో యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మద్యం ఉందన్న అనుమానంతో ఎక్సైజ్‌ పోలీసులు బైక్‌ను వెంబడించగా ఎదురుగా వస్తున్నలారీ ఢీకొని ఓ విద్యార్థి చనిపోగా, మరోకరు గాయపడ్డారు.

New Update
Road Accident

Road Accident

కాకినాడ జిల్లా (Kakinada District) ఎక్సైజ్‌ సిబ్బంది అత్యుత్సాహం ఒక యువకుడి నిండు ప్రాణం తీయగా, మరో యువకుడు చావుబతుకుల మధ్య కొట్టెమిట్టాడుతున్నాడు. మద్యం ఉందన్న అనుమానంతో ఎక్సైజ్‌ పోలీసులు బైక్‌ను వెంబడించగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని ఓ విద్యార్థి చనిపోయారు. మరో విద్యార్థి సీరియస్‌గా ఉన్నాడు. వివరాల ప్రకారం...యానాం – ద్రాక్షారామ రహదారిలోని ఇంజరం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరప మండలం గురజనాపల్లి శివారు అడివిపూడి గ్రామానికి చెందిన కోట శ్రీరామ్‌ (21), పిఠాపురానికి చెందిన మరో యువకుడు పెద్దాపురంలోని ఒక కళాశాలలో చదువుతున్నారు. వీరు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వచ్చి తిరిగి వెళుతుండగా మద్యం తరలిస్తున్నారనే అనుమానంతో సుంకరపాలెం ఎక్సైజ్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అయితే వీరు బైక్‌ ఆపకుండా వెళ్లిపోవడంతో ఎక్సైజ్‌ పోలీసులు (Excise Police) వెంబడించారు. తమను పోలీసులు వెండిస్తున్నారన్న కంగారులో బైకును యువకులు వేగంగా నడిపారు.దీంతో వేగంగా బైక్‌ నడుపుతూ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కోట శ్రీరామ్‌కు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటీన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Also Read: SLBC breaking : టన్నెల్ ప్రమాదంలో కీలక పురోగతి....కార్మికుల ఆన‌వాళ్లు గుర్తించిన కేర‌ళ జాగిలాలు

Excise Police's Overzealousness - Road Accident

యువకుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఎక్సైజ్‌ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని ముట్టడించారు. ఇన్ఫార్మర్లు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ..పోలీసులు వెంబడించడంతోనే మా అబ్బాయి చనిపోయాడని వారు ఆరోపించారు. సరదాగా యానాంలో నలుగురు యువకులు ఫోటోలు తీసుకోవటానికి వేళ్ళారే తప్పా.. ఏటువంటి మందు వాళ్ళ దగ్గర దోరకలేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేశారు.ఎక్సైజ్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం బలై పోయిందని సిబ్బందిని నిలదీశారు. డిపార్ట్‌మెంట్‌కు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తిని మద్యం దుకాణాల వద్ద నిఘా పెట్టి.. అతడు ఇచ్చిన సమాచారంతో ప్రతి రోజూ ఇదే మాదిరిగా వేధిస్తున్నారన్నారని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సుంకరపాలెం చెక్‌పోస్టు వద్ద పరిస్థితిని సమీక్షించారు.

ఇది కూడా చూడండి: Trolls on Jr NTR: ఎన్టీఆర్ యాడ్ పై గోరంగా ట్రోలింగ్‌..! వీడియో చూశారా?

సుంకరపాలెం పరిసర గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు ఎక్సైజ్‌ చెక్‌పోస్టును ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోట శ్రీకాంత్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వారితో కాకినాడ రూరల్‌ సీఐ చైతన్యకృష్ణ, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఏనుగుల చైతన్య మురళి, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరెంటెండెంట్‌ మౌనిక, ఎకైజ్‌ సీఐ స్వామి చర్చిస్తున్నారు. ఇంద్రపాలెం, గొల్లపాలెం, తిమ్మాపురం ఎస్సైలు వీరబాబు, మోహన్‌కుమార్‌, రవీంద్ర శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.సుంకరపాలెం చెక్ పోస్టు వద్ద జరిగిన సంఘటనకు బాధ్యుడిని చేస్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. సంఘటనా స్దలానికి వచ్చిన ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ కానిస్టేబుల్ ను విధులనుండి తొలగిస్తూ, ఇన్ ఫార్మర్ ఎవరన్నది తెలుసుకొని అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని   ఎక్సైజ్ డీసీపీ.తెలిపారు.

Also Read: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు