TS: మరో వారంలో ఇందిరమ్మ ఇళ్ళు.. మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ళపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. మరో వారం రోజుల్లో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు.  అర్హులైన వారిని ఎంపిక చేసి..పనులు మొదలుపెడతామని తెలిపారు.

author-image
By Manogna alamuru
New Update
Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma Houses) టైమ్ వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ల (MLC Elections 2025) కారణంగా ఆపేసిన ఈ పథకం అమలును ఇప్పుడు మొదలుపెట్టనున్నారు. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి బిగ్ అప్డేట్ ఇచ్చారు. మరో వారం రోజుల్లో ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి..పనులు మొదలుపెడతామని తెలిపారు. జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందనక్కర్లేదని...అన్నీ పరిశీలించాకనే పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి (Ponguleti) భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ ఒక నిరంతర ప్రక్రియ అని..ఇప్పుడు కాకపోతే మరో విడతలో లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని చెప్పారు. 

Also Read :  కుటుంబ కలహాలతో తల్లిని నరికి చంపిన కొడుకు

Also Read :  విజయ్ వర్మతో బిల్క్ బ్యూటీ బ్రేకప్.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తమన్నా

రీ వెరిషికేషన్ ప్రక్రియ ప్రారంభం..

ఇక ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ (Re-Verification) ప్రారంభించారు. జనవరి 26న రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో పథకాన్ని ప్రారంభించి అధికారులు అర్హుల జాబితాను ప్రకటించారు. మొదటి విడతలో 72,045 మందికి ఇళ్లను మంజూరు చేశారు.  ఇప్పుడు  గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాల్లోని తక్కిన పల్లెల్లో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు.  దరఖాస్తులను పరిశీలించి దరఖాస్తుదారులను ఎల్‌-1(సొంత స్థలాలు ఉన్నవారు), ఎల్‌-2(సొంత స్థలం కాని, ఇల్లు కాని లేని వారు), ఎల్‌-3(ఇతరులు) అని మూడు జాబితాలుగా విభజించారు. ప్రస్తుతం ఎల్-1 జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఇందులో 21.93 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. 

Also Read :  Womens Day 2025: ఈరోజు స్పెషల్ ఇదే.. మహిళల చేతికి మోదీ సోషల్ మీడియా అకౌంట్లు

Also Read :  కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.55 వేల భారీ డిస్కౌంట్ పొందే ఛాన్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు