UP: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం రెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ ని మొరాదాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

New Update
up police

up police

రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న కరడుకట్టిన హిజ్బుల్ ముజాహిదీన్‌ (Hizbul Mujahideen) తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ అలియాస్ మొహమ్మద్ సైఫుల్ ఇస్లాం అలియాస్ అఫ్జల్ హుస్సేన్ మాలిక్‌ని మొరాదాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని  అరెస్ట్ చేశారు. 

Also Read: Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!

2002 నుంచి పరారీలో...

యూపీ (UP) లో పెద్ద ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు తేలింది.హుస్సేన్ జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతడిపై రూ. 25,000 రివార్డ్ ఉంది. 2002 నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. నిందితుడు యూపీకి రాక ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. 

Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

హుస్సేన్ ను మొదటిసారి జూలై 9, 2001న అరెస్టు చేశారు. భద్రతా దళాలు అతని నుంచి ఒక AK-47 రైఫిల్, ఒక AK-56 రైఫిల్, రెండు పిస్టల్స్, 12 హ్యాండ్ గ్రెనేడ్లు, 50 డిటోనేటర్లు, 29 కిలోల పేలుడు పదార్థాలు మరియు 507 లైవ్ కార్ట్రిడ్జ్‌లతో సహా భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. అయితే, బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత, సుమారు 17 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు.

 ఉగ్రవాదిపై మొరాదాబాద్ కోర్టు అతడిపై వారెంట్ జారీ చేసింది. యూపీ ఏటీఎస్ అతడిని పట్టుకుని శనివారం అరెస్ట్ చేసింది.

Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

Also Read: Hyderabad: నగర వాసులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌ న్యూస్‌... ఇక పై వాటిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు!

Advertisment
తాజా కథనాలు