Road Accident: కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
మధ్యప్రదేశ్‌లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
మధ్యప్రదేశ్‌లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
యాంకర్ రష్మీ పెట్ మృతి చెందడంతో అస్థికలను గోదావరి నదిలో కలిపింది. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిన్ను ప్రేమించే అవకాశం కోసం నేను జీవితాంతం మిస్ అవుతూనే ఉంటానని.. పునర్జన్మ ఉంటే నువ్వు పుడతావని కోరుకుంటున్నానని తెలిపింది.
బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈరోజు ఆయన నామినేషన్ వేయనున్నారు.
టీమిండియా విజయాన్ని ర్యాలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న వారిపై మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. మౌలో ప్రాంతంలోని జామా మాసీద్ సమీపంలో అల్లర్లు చెలరేగి 2 దుకాణాలు, 2 వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతుంటే, బొప్పాయి తినకుండా ఉండాలి. బొప్పాయిలో కనిపించే కొన్ని అంశాలు శ్వాసకోశ రుగ్మతలను రేకెత్తిస్తాయి. ఇది కాకుండా, కొంతమందికి ఈ పండు తినడం వల్ల అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి.
ముంబై కుర్లా ప్రాంతానికి చెందిన రూబీ అనే మహిళకు రెస్టారెంట్ లో బిర్యానీ తింటున్న సమయంలో ఎముక గొంతులో ఇరుక్కుంది. దాని వల్ల ఆమె 21 రోజుల పాటు అవస్థలు పడగా...8 లక్షలు ఖర్చు పెట్టి బయటకు తీయాల్సి వచ్చింది.
పాకిస్థాన్ లో ఉగ్ర దాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. ఏ సమయంలోనైనా దాడులు జరిగే అవకాశాలున్నాయి. వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ అమెరికా తన పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ హెచ్చరికలు జారీ చేసింది.
న్యూయార్క్‌లోని హోంప్టన్స్‌లో మంటలు చెలరేగాయి. తీవ్రమైన గాలుల కారణంగా కార్చిచ్చు పొగ వల్ల రెండు వాణిజ్య భవనాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
కాకినాడ జిల్లా ఎక్సైజ్ సిబ్బంది అత్యుత్సాహం ఒక యువకుడి నిండు ప్రాణం తీయగా,మరో యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మద్యం ఉందన్న అనుమానంతో ఎక్సైజ్ పోలీసులు బైక్‌ను వెంబడించగా ఎదురుగా వస్తున్నలారీ ఢీకొని ఓ విద్యార్థి చనిపోగా, మరోకరు గాయపడ్డారు.