Champions Trophy 2025: టీమిండియా ఫ్యాన్స్‌పై రాళ్ల దాడి.. అర్థరాత్రి అల్లర్లు

టీమిండియా విజయాన్ని ర్యాలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న వారిపై మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. మౌలో ప్రాంతంలోని జామా మాసీద్ సమీపంలో అల్లర్లు చెలరేగి 2 దుకాణాలు, 2 వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

New Update
MP maou incident

MP maou incident Photograph: (MP maou incident)

ఛాంపియన్ ట్రోఫీ (Champions Trophy 2025) ఫైలన్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ (New Zeland) పై భారత్ (India) విజయం సాధించడంతో క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఆదివారం దుబాయ్ వేధికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీంమిడియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వీట్లు పంచుతూ, క్రాకర్స్ కాల్చుతూ టీమిండియా ఫ్యాన్స్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ ప్రాంతంలో భారత క్రికెట్ విజయోత్సవ ర్యాలీలో ఘర్షణలు చెలరేగాయి. ర్యాలీగా వస్తుండగా మోవ్‌లోని జామా మసీదు సమీపంలో గుర్తు తెలియని కొందమంది వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

Also Read :  ఇది అసాధారణ మ్యాచ్‌..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు!

Team India Cricket Fan Rally In Madhya Pradesh

Also Read :  ప్రేయసితో స్టేడియంలో చాహల్.. నెట్టింట వీడియో వైరల్

దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు మొదలైయ్యాయి.  ఈ సంఘటన (మార్చి9) ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఈ అల్లర్ల కారణంగా దుండగులు రెండు వాహనాలు, రెండు దుకాణాలకు నిప్పంటించారు. అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కొన్ని హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి. 

Also Read :  రోహిత్‌ను తిట్టిన నోటితోనే హ్యాట్సాఫ్ అంటూ షామా పొగడ్తలు

సమాచారం అందుకున్న పోలీసు బలగాలు మౌలోని జామా మసీద్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని చెదరగొట్టి అల్లర్లు ఆపేశారు. హింసాకాండ తరువాత ఇండోర్ నుంచి భారీగా పోలీసులు, సైనిక బలగాలు మోహరించాయి.  మోహౌలో ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్‌ పరిస్థితి అదుపులో ఉందని, ఆ ప్రాంతంలో బలగాలను మోహరించామని చెప్పారు.  ముగ్గురు వ్యక్తులకు గాయాలైయ్యాయని ఇండోర్ రూరల్ ఎస్పీ హితికా వాసల్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్లకు కారణమైన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని చెబుతున్నారు. 

Also Read :  ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు