America-Pak: పాక్‌ కి వెళ్లకండి.. అమెరికా హెచ్చరికలు!

పాకిస్థాన్ లో ఉగ్ర దాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. ఏ సమయంలోనైనా దాడులు జరిగే అవకాశాలున్నాయి. వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ అమెరికా తన పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ హెచ్చరికలు జారీ చేసింది.

New Update
GAZA: ఇజ్రాయెల్ మీద హమాస్ ఎదురుదాడి..8 మంది సైనికులు మృతి

pak

పాకిస్థాన్ (Pakistan) లో ఉగ్ర దాడులు (Terrorists Attack) జరిగే ప్రమాదం ఎక్కువ.. ఏ సమయంలోనైనా దాడులు జరిగే  అవకాశాలున్నాయి. వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ అమెరికా తన పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లకు అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది.

Also Read: UP: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

ఆయా ప్రావిన్స్ లలో ఎప్పుడు ఎక్కడ ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందనేది చెప్పలేమని, పౌరులను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని తెలిపింది. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాద కార్యకలాపాలతోపాటు సైనిక ఘర్షణలు జరిగే అవకాశముందని హెచ్చరించింది. పాకిస్థాన్‌కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

Also Read:  Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!

USA Issues Do Not Travel Pakistan

మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. ఈమేరకు శుక్రవారం (అమెరికా కాలమానం) ఈ ట్రావెల్ అడ్వైజరీని ఇష్యూ చేసింది.

ఇందులో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏరియాకు అస్సలు ప్రయాణించవద్దని లెవెల్ 4 హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల్లో మిలిటెంట్ గ్రూపులు దాడులు చేయొచ్చని, సరిహద్దులకు రెండువైపులా రెండు దేశాలు భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించాయని వివరించింది. 

పాక్ నుంచి భారత్ లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.

Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు