Vijayanagaram: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్

ఆంధ్రప్రదేశ్ జనాభా పెంచడానికి విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయడు వినూత్న రీతిలో ప్రోత్సాక బహుమతి ప్రకటించారు. 3వ కాన్పులో ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50వేలు, మగ పిల్లాడైతే ఆవు బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆఫర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

New Update
TDP MP appala nayudu

TDP MP appala nayudu Photograph: (TDP MP appala nayudu)

జనాభా (Population) ను ప్రోత్సహించడానికి పార్లమెంట్ సభ్యుడు బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించాడు. అందులో ఆడపిల్లల్ని కన్న వారికి పెద్ద మొత్తంలో డబ్బులు గిఫ్ట్‌గా ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆయనొవరో కాదు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం టీడీపీ ఎంపీ కాళీశెట్టి అప్పలనాయుడు. ఈయన ఆఫర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ జనాభాను పెంచడానికి వినూత్నరీతిలో ఓ ప్రోత్సహక బహుమతి ప్రకటించారు.

Also Read :  ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష

Andhra MP Promises 50,000 For Women

Also Read :  కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి

ప్రస్తుతం చాలామంది ఇద్దరు లేదా ఒక్కర్ని మాత్రమే కంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కొద్దీ రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. దీని కారణంగా  దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోందని.. రాబోయే రోజుల్లో అది పెద్ద ప్రమాదంగా మారుతుందని ఆయన చెప్పారు. ఒక్కరు, ఇద్దరు కాకుండా ముగ్గురు పిల్లల్ని కూడా కనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ మాటలు ఆదర్శంగా తీసుకున్న ఎంసీ మూడవ కాన్పులో ఆడపిల్ల పుట్టిన దంపతులకు రూ.50 వేలు ఇస్తానని హామి ఇచ్చారు. అంతేకాదు అబ్బాయి జన్మిస్తే ఆవును గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పాడు. ఈ ఆఫర్ రాష్ట్రవ్యాప్తంగా అందర్ని ఆకర్షిస్తోంది. గత కొన్నిరోజులు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఆఫర్ గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Also read: MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

ప్రకాశం జిల్లా మార్కాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంపీ అప్పల నాయుడు (Appala Naidu) మాట్లాడుతూ.. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రభుత్వం, ప్రైవేట్ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని ప్రకటించారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారని ఆయన గుర్తుచేశారు. అందుకు గానే ఆయన మూడవ కాన్పులో ఆడపిల్ల పుడితే వారికి రూ.50 వేలు, అబ్బాయి పుడితే ఆవుని బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. 

Also Read :  నీ కోసం జీవితాంతం ఎదురు చూస్తానని.. యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు