MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈరోజు ఆయన నామినేషన్ వేయనున్నారు.

New Update
somu virraju

somu virraju Photograph: (somu virraju)

బీజేపీ (BJP) హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. కూటమి పొత్తులో భాగంగా టీడీపీ 3 స్థానాలకు పోటీ చేస్తుండగా.. జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి కేటాయించారు. జనసేనా అభ్యర్థిగా నాగబాబును ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ (ఎస్టీ), బీద రవి చంద్ర(బీసీ), బీటీ నాయుడు (బీసీ) పేర్లను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు (MLC Elections Nominations) సోమవారం చివరి రోజు కావడంతో బీజేపీ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ఖరారు చేసింది.

Also Read :  ఏలూరులో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే 30 మంది!

పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు (Somu Veerraju) పేరును ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం(ఈరోజు) నామినేషన్ వేయనున్నారు. ఇక ఇప్పటికే జనసేనా ఎమ్మెల్సీ అభ్యర్థి నాగబాబు ఆయన నామినేషన్ వేశారు.  

Also Read : వైద్యురాలితో అసభ్య ప్రవర్తన.. తమ్మయ్య బాబును సస్పెండ్ చేసిన జనసేనాని!

BJP MLC Candidate Somu Veerraju

Also Read :  TDP ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..

మార్చి 29 నాటికి ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది. దీంతో  మార్చి 3 ఈ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 10 లోపు ఆయా పార్టీ అభ్యర్థులు నామినేసన్ దాఖలు చేయనున్నారు. మార్చి 20 పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్లు లెక్కించనున్నారు.

Also Read :  ఎక్సైజ్ పోలీసుల అత్యుత్సాహం యువకుడు మృతి...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు