/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదం (Road Accident) లో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, సిధీ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 21మంది ఎస్‌యూవీలో మైహార్‌లోని శారదా మాత ఆలయానికి వెళ్తుతున్నారు.
Also Read: Kohli: ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!
Road Accident In Madhya Pradesh
VIDEO | Madhya Pradesh: Several people died, while some others got injured after a car collided with a truck in Sidhi last night.
— Press Trust of India (@PTI_News) March 10, 2025
DSP Gayatri Tiwari says, “Last night at around 2 am, we received the information about the accident between a bulker and a car near Utni Petrol Pump.… pic.twitter.com/LVxoYGOrRe
Also Read: SLBC tunnel: TBM ఆపరేటర్ గురుప్రీత్ డెడ్‌బాడీ.. తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
రెండు గంటల ప్రాంతంలో సీధీ-బహ్రి రోడ్డులో పెట్రోల్ బంక్ వద్ద అతివేగంగా వస్తున్న ఓ ట్రక్కు, ఎస్‌యూవీకి ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడికే ఏడుగురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రుల్లో 9మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని రేవా ఆసుపత్రికి తరలించినట్లు సీధీ డీఎస్పీ గాయత్రి తివారీ తెలిపారు. మిగిలిన వారికి సీధీ జిల్లా ఆస్పత్రినే చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: PM Modi: ఇది అసాధారణ మ్యాచ్..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు!