/rtv/media/media_files/2024/11/25/wsowajpng1RG5lCsUga2.jpg)
గతేడాది ఉక్రెయిన్ (Ukraine) సైనికులు రష్యా (Russia) సరిహద్దులు దాటి అక్కడి కస్క్ ప్రాంతాన్ని అనూహ్య రీతిలో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.దీంతో ఆ ప్రాంతంలో ఇరుపక్షాల నడుమ పోరాటం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీవ్ సైన్యాన్ని కట్టడి చేసేందుకు రష్యన్ ప్రత్యేక బలగాలు వినూత్న మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది.ఓ గ్యాస్ పైప్ లైన్ లో దాక్కుని కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి మరీ ప్రత్యర్థుల పై విరుచుకుపడినట్లు వెల్లడైంది.
Also Read: America Flight Accident: అమెరికాలో మరో విమాన ప్రమాదం...
ఉక్రెయిన్ సైన్యంతో పాటు రష్యన్ యుద్ధ బ్లాగర్లను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. గతేడాది ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యాలు రష్యాలోని కస్క్ లో ప్రవేశించాయి.వ్యూహాత్మక సరిహద్దు పట్టణం సుడ్జా సహా దాదాపు 1000 చదరుపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
Also Read: Big Breaking:లలిత్ మోడీకి బిగ్ షాక్ ..పాస్ పోర్టు రద్దు!
Russia Strikes Ukraine Troops
వందలాది మంది స్థానికులను యుద్ధ ఖైదీలుగా బంధించాయి. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తరువాత రష్యాలో కొంత భూభాగాన్ని ఆక్రమించిన మొట్టమొదటి దేశంగా ఉక్రెయిన్ నిలిచింది. అయితే..నెలల వ్యవధిలోనే మాస్కో బలగాల ధాటికి వెనుకంజ వేసింది.దాదాపు 50 వేల మంది రష్యన్, ఉత్తర కొరియా సైనికులు విరుచుకుపడటంతో..ఇప్పటికే అనేక మంది కీవ్ సైనికులు ప్రాణభయంతో పలాయనం చిత్తగించారు.
ముఖ్యంగా సుడ్జా పట్టణంలో ఉక్రెయిన్ ఊహించని రీతిలో ఎదురుదాడులు చవిచూసినట్లు క్రెమ్లిన్ అనుకూల బ్లాగర్ యూరి పొడోలియాకా తన పోస్టుల్లో వెల్లడించారు.కొంత కాలం క్రితం వరకు ఐరోపాకు గ్యాస్ సరఫరా ఉపయోగించిన భారీ పైప్ లైన్ ను మాస్కో దళాలు ఉపయోగించాయి. పైప్ లైన్ లోపల దాదాపు 15 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి..సుడ్జా పట్టణం సమీపంలో ప్రత్యర్థుల పై దాడులు చేశాయి.
కొంతమంది సైనికులు పైప్ లైన్ లో చాలా రోజులు గడిపారని తెలిపారు. ఉక్రెయిన్ పై పుతిన్ దండయాత్రకు ముందు సుడ్జా పట్టణ జనాభా దాదాపు 5,000.పైప్ లైన్ వెంబడి అనేక స్టేషన్లు ఉన్నట్లు సమాచారం. సుడ్జాను మళ్లీ చేజిక్కించుకునేందుకు రష్యన్ దళాలు గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఆ పట్టణంలోకి ప్రవేశించాయని టూ మేజర్స్ అనే మరో యుద్ధ బ్లాగర్ చెప్పారు. రష్యన్ సేనలు గ్యాస్ మాస్క్‌లు ధరించి పైపుగుండా వెళ్తున్నట్లు కనిపిస్తున్న ఫొటోలు స్థానికంగా చక్కర్లు కొడుతున్నాయి.
సుడ్జా శివార్లలో పట్టు సాధించేందుకు పుతిన్ బలగాలు పైప్ లైన్ ను ఉపయోగించాయని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ సైతం ధ్రువీకరించింది.అయితే వారిని సకాలంలో గుర్తించి ,దాడి చేసినట్లు వెల్లడించింది.స్థానికంగా మాస్కో సేనలకు భారీ నష్టాలు వాటిల్లుతున్నట్లు తెలిపింది.
Also Read: Hyderabad Crime: వెబ్ సిరీస్, యూట్యూబ్ చూసి ఇద్దరిని చంపేశాడు!
Also Read: PM Modi: ఇది అసాధారణ మ్యాచ్..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు!